మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ ( 25 బంతుల్లో 61పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 4సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 25 బంతుల్లో 26 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. సికందర్ రజా, ఎంగర్వ, ముజార్బానీ తలా ఓ వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మరోసారి మంచి ఆరంభం లభించలేదు. ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 15 పరుగులు చేసి ముజార్బానీ బౌలింగ్ లో మసకజ్దాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే, మరోసారి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించారు. ఈ ఇద్దరూ సింగిల్స్ తీస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సీన్ విలియమ్స్ విడదీశాడు.
Unstoppable SKY ???? 79 runs in last 5 overs propels India to a solid total ????#T20WorldCup | #ZIMvIND |????: https://t.co/SFsHINI2PL pic.twitter.com/p8CMwPkQXL
— ICC (@ICC) November 6, 2022
25 బంతుల్లో 26 పరుగులు చేసిన కోహ్లీ.. ర్యాన్ బర్ల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత వరుసగా రెండో హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ సికందర్ రజా బౌలింగ్ లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. అయితే, ఆ వెంటనే దినేష్ కార్తీక్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కేవలం మూడు పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో..101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
అయితే, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు. సూర్య తన ఫామ్ ను ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేయగా.. హార్దిక్ పాండ్యా తనకు సహకరించాడు. ఆఖర్లో వీరిద్దరూ పోటీ పడి మరి బౌండరీలు బాదేయడంతో టీమిండియాకు భారీ స్కోరు లభించింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 50 పరుగులకు పైగా విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో సూర్య 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
జింబాబ్వే : వెస్లే మదవరే, క్రెయిన్ ఎర్విన్ (కెప్టెన్), చకబవ, సీన్ విలియన్స్, సికందర్ రజా, టోని మున్గేంగా , ర్యాన్ బర్ల్, వెల్లింగ్టన్ మసకజ్దా , రిచర్డ్ ఎంగర్వ, తెండాయ చతారా, బ్లెసింగ్ ముజర్బానీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Virat kohli, Zimbabwe