IND vs SA : పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న గ్రూప్ ‘2’ సూపర్ 12 మ్యాచ్ లో భారత్ (India) తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ను దక్షిణాఫ్రికా పేసర్లు హడలెత్తిస్తున్నారు. రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 సిక్స్), కేఎల్ రాహుల్ (13 బంతుల్లో 9; 1 సిక్స్) మరోసారి విఫలం అయ్యారు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన విరాట్ కోహ్లీ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) బౌండరీ లైన్ దగ్గర రబడ చేతికి చిక్కాడు. ఇక అక్షర్ పటేల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా (0) ఖాతా తెరవుకుండానే పెవిలియన్ కు చేరాడు. ఆశలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా (2) రబడ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. దాంతో భారత్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 60 పరుగులు చేసింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (16 బ్యాటింగ్), దినేశ్ కార్తీక్ () క్రీజులో ఉన్నారు. లుంగీ ఎంగిడి 4 వికెట్లు తీశాడు. నోకియా ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.
ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, కేఎల్ రాహుల్ లు ఆరంభంలో మరీ నెమ్మదిగా ఆడారు. తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. అయితే ఇద్దరు కూడా సిక్సర్లతో ఖాతా తెరిచారు. దాంతో భారత్ కు ఓపెనింగ్ సమస్య ముగిసిందని అనిపించింది. అయితే బౌలింగ్ కు వచ్చిన ఎంగిడి ఒకే ఓవర్లో రోహిత్, రాహుల్ లను పెవిలియన్ కు పంపాడు. రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ కూడా బౌన్సర్ కు బలయ్యాడు. ఇక దీపక్ హుడా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. కేవలం మూడు బంతులకే తన కథను ముగించాడు. ఆదుకుంటాడనుకున్న హార్దిక్ పాండ్యా కూడా అవుటయ్యాడు. దాంతో భారత్ ఎదురీదుతోంది.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
దక్షిణాఫ్రికా
డికాక్, బవుమా (కెప్టెన్), రోసో, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, ఎంగిడి, నోకియా , రబడ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs South Africa, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli