హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : టఫ్ ఫైట్ లో టాస్ నెగ్గిన రోహిత్.. ఒక మార్పు చేసిన భారత్.. తుది జట్లు ఇవే

IND vs SA : టఫ్ ఫైట్ లో టాస్ నెగ్గిన రోహిత్.. ఒక మార్పు చేసిన భారత్.. తుది జట్లు ఇవే

PC : ICC

PC : ICC

IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) మరో కీలక మ్యాచ్ కు రెడీ అయ్యింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ సెమీఫైనల్ పై కన్నేసింది. పెర్త్ వేదికగా మరికాసేపట్లో జరిగే గ్రూప్ ‘2’ మ్యాచ్ లో సౌతాఫ్రికా (South Africa)తో తలపడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) మరో కీలక మ్యాచ్ కు రెడీ అయ్యింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ సెమీఫైనల్ పై కన్నేసింది. పెర్త్ వేదికగా మరికాసేపట్లో జరిగే గ్రూప్ ‘2’ మ్యాచ్ లో సౌతాఫ్రికా (South Africa)తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక  మార్పు చేసింది. అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా కూడా ఒక మార్పు చేసింది. షమ్సీని పక్కన బెట్టి అతడి స్థానంలో పేసర్ లుంగీ ఎంగిడిని తీసుకుంది.

అక్షర్ ను పక్కన పెట్టడానికి కారణం ఇదే

పెర్త్ పిచ్ పేస్ కు అనుకూలిస్తుంది. దాంతో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం అనవసరం అనే ఆలోచనతో భారత్ అక్షర్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. జట్టులో ముగ్గురు సీమర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా కూడా పేస్ బౌలింగ్ వేయగలడు. దాంతో అక్షర్ స్థానంలో పేసర్ ను కాకుండా ఎక్స్ ట్రా బ్యాటర్ ను తీసుకుంది. అయితే దీపక్ హుడాను తీసుకోవడం కంటే పంత్ కు అవకాశం ఇచ్చి ఉంటే బావుండేది అని చాలా మంది అనుకుని ఉంటారు. అయితే దీపక్ హుడా బౌలింగ్ కూడా చేయగలగడంతో అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అవసరం అయితే ఒకటి రెండు ఓవర్లు వేయగలడు కాబట్టి పంత్ ను కాదని రోహిత్ దీపక్ హుడా వైపు మొగ్గు చూపాడు. అయితే ప్రస్తుతం జట్టులో అందరు రైట్ హ్యాండ్ బ్యాటర్లే ఉన్నారు. పంత్, అక్షర్, అర్ష్ దీప్ లు మాత్రమే లెఫ్టాండర్స్ గా ఉన్నారు. అయితే అర్ష్ దీప్ ను ప్రాపర్ బ్యాటర్ గా భావించలేము. ఈ మ్యాచ్ కోసం అక్షర్ ను తప్పించడంతో భారత్ జట్టులో ప్రాపర్ లెఫ్టాండ్ బ్యాటర్ లేకుండా పోయాడు. ఇక సౌతాఫ్రికా మాత్రం షమ్సీ స్థానంలో ఎక్స్ ట్రాగా పేసర్ ను తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా కూడా 4 గురు పేసర్లు ఒక స్పిన్నర్ తో ఆడనుంది.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా,  అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్

దక్షిణాఫ్రికా

డికాక్, బవుమా (కెప్టెన్), రోసో, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, ఎంగిడి, నోకియా , రబడ

First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, KL Rahul, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు