IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India)కు తొలిసారి అసలైన సవాల్ ఎదురైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న సూపర్ 12 గ్రూప్ ‘2’ మ్యాచ్ లో సౌతాఫ్రికా (South Africa) పేస్ బౌలింగ్ కు భారత్ బ్యాటర్స్ తల వంచారు. లుంగీ ఎంగిడి 4 వికెట్లు, వేన్ పార్నెల్ 3 వికెట్లతో చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే మెరిశాడు. మిగిలిన బ్యాటర్స్ లో రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 సిక్స్), కేఎల్ రాహుల్ (13 బంతుల్లో 9; 1 సిక్స్) మరోసారి విఫలం అయ్యారు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన విరాట్ కోహ్లీ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మరోసారి శుభారంభం లభించలేదు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, కేఎల్ రాహుల్ (9) లు ఆరంభంలో మరీ నెమ్మదిగా ఆడారు. తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. అయితే ఇద్దరు కూడా సిక్సర్లతో ఖాతా తెరిచారు. దాంతో భారత్ కు ఓపెనింగ్ సమస్య ముగిసిందని అనిపించింది. అయితే బౌలింగ్ కు వచ్చిన ఎంగిడి ఒకే ఓవర్లో రోహిత్, రాహుల్ లను పెవిలియన్ కు పంపాడు. రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ కూడా బౌన్సర్ కు బలయ్యాడు. ఇక దీపక్ హుడా (0) తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. కేవలం మూడు బంతులకే తన కథను ముగించాడు. ఆదుకుంటాడనుకున్న హార్దిక్ పాండ్యా (2) కూడా అవుటయ్యాడు. దాంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
సూర్య ఒక్కడే
ఈ దశలో భారత్ 100 పరుగుల మార్కును కూడా చేరుకునేది కష్టంగానే కనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. దినేశ్ కార్తీక్ (6)తో కలిసి 6వ వికెట్ కు 52 పరుగులు జోడించాడు. ఇందలో కార్తీక్ వాటా కేవలం 6 పరుగులే కాగా మిగిలిన పరుగులు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి వచ్చినవే. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో కార్తీక్ పెవిలియన్ కు చేరాడు, మరో ఎండ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. దాంతో భారత్ 140 ప్లస్ పరుగులు చేసేలా కనిపించింది. అయితే చివర్లో సూర్య అవుటవ్వడం ఆ తర్వాత మిగిలిన ప్లేయర్ల్ దూకుడుగా ఆడలేకపోవడంతో భారత్ 133 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ను ముగించింది.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
దక్షిణాఫ్రికా
డికాక్, బవుమా (కెప్టెన్), రోసో, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, ఎంగిడి, నోకియా , రబడ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Virat kohli