IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో టీమిండియా (Team India)కు తొలి ఓటమి ఎదురైంది. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయాలు సాధించి జోరు మీదున్న భారత్ (India)కు సౌతాఫ్రికా (South Africa) షాకిచ్చింది. 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసి నెగ్గింది. కీలక సమయాల్లో భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మైదానంలో కీలకమైన క్యాచ్ లు, రనౌట్ ఛాన్స్ లను వదిలేశారు. దాంతో బతికిపోయిన మార్కరమ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కిల్లర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను గెలిపించాడు. భారత పేసర్లు అద్బుతంగా బౌలంగ్ చేసినా చెత్త ఫీల్డింగ్ టీమిండియా కొంప ముంచింది. అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. షమీ, హార్దిక్ పాండ్యా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.
విలన్లుగా రోహిత్, కోహ్లీ
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు బెదరగొట్టారు. అర్ష్ దీప్ సింగ్ తన తొలి ఓవర్లో ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్ (1)తో పాటు రోసో (0)లను అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ బవుమా (10)ని షమీ పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కరమ్, మిల్లర్ పరుగుల కోసం ఆరంభంలో తీవ్రంగా తడబడ్డారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 40 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇక్కడే టీమిండియా సీనియర్లు రోహిత్, కోహ్లీ తప్పిదాలు చేశారు. మార్కరమ్ ను రెండు సార్లు రనౌట్ చేసే అవకాశాన్ని రోహిత్ మిస్ చేశాడు. ఇక కోహ్లీ ఒక ఈజీ క్యాచ్ ను వదిలేశాడు. ఈ లైఫ్స్ నుంచి బతికిపోయిన మార్కరమ్ అర్ధ సెంచరీతో మిల్లర్ తో కలిసి నాలుగో వికెట్ కు76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో మార్కరమ్, స్టబ్స్ అవుటైనా.. మిల్లర్ వరుసగా రెండు ఫోర్లు బాది జట్టును గెలిపించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే మెరిశాడు. మిగిలిన బ్యాటర్స్ లో రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 సిక్స్), కేఎల్ రాహుల్ (13 బంతుల్లో 9; 1 సిక్స్) మరోసారి విఫలం అయ్యారు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన విరాట్ కోహ్లీ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించారు. లుంగీ ఎంగిడి 4 వికెట్లు, వేన్ పార్నెల్ 3 వికెట్లతో చెలరేగారు. ఈ మ్యాచ్ లో గెలవడంతో 5 పాయింట్లతో సౌతాఫ్రికా గ్రూప్ లో అగ్రస్థానంలోకి చేరుకుంది. భారత్ రెండో స్థానంలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs South Africa, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli