హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : రాహుల్ కు మరో అవకాశం! సౌతాఫ్రికాతో టీమిండియా టఫ్ ఫైట్.. భారత్ తుది జట్టు ఇదే

IND vs SA : రాహుల్ కు మరో అవకాశం! సౌతాఫ్రికాతో టీమిండియా టఫ్ ఫైట్.. భారత్ తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India) హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మెగా టోర్నీలో ఇప్పటికే ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్.. ఆదివారం కఠిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా (South Africa)తో తలపడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India) హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మెగా టోర్నీలో ఇప్పటికే ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్.. ఆదివారం కఠిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా (South Africa)తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితో భారత్ సెమీఫైనల్ కు దాదాపుగా చేరుకున్నట్లే. దాంతో భారత్ ఈ మ్యాచ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో బౌలర్లు పండగ చేసుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం గం. 4.30లకు ఆరంభం కానుంది. భారత్ తో పాటు సౌతాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత సఫారీ జట్టు పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సి ఉంది.

రాహుల్ కు మరో అవకాశం

టి20 ప్రపంచకప్ లో ఇప్పటి వరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో ఆశించిన స్థాయిలో ఆడని ఒకే ఒక ప్లేయర్ కేఎల్ రాహుల్. తొలి మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన అతడు.. నెదర్లాండ్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో అంపైర్ తప్పిదం కారణంగా 12 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు, దాంతో రాహుల్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో రిషభ్ పంత్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే రాహుల్ కు మరో అవకాశం ఇచ్చేందుకే టీం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో అతడు సౌతాఫ్రికాతో జరిగే పోరులో ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో రోహిత్ ఆడినా అది అతడి స్థాయికి తగ్గ ఆట కాదు. దాంతో దక్షిణాఫ్రికాపై భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, షమీలతో పాటు హార్దిక్ పాండ్యాలు మెరగ్గానే ఉన్నారు. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లు మెరిశారు. పెర్త్ పేస్ కు సహకరించే పిచ్ కావడంతో సౌతాఫ్రికా బౌలింగ్ ను భారత్ ఏ విధంగా ఎదర్కొంటుందో చూడాలి. గత రెండు మ్యాచ్ ల్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.

ఇక టీమిండియా మూడు విభాగాల్ల ో మెరుగవ్వాల్సి ఉంది. ఓపెనింగ్, పవర్ ప్లే, డెత్ ఓవర్స్ లో భారత్ ఇంప్రూవ్ అవ్వాలి. గత రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ పవర్ ప్లేలో 6 కంటే తక్కవ రన్ రేట్ తో పరుగులు సాధించింది. ఓపెనర్లు ఇప్పటివరకు శుభారంభం చేయలేదు. ఇక డెత్ ఓవర్స్ లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్ మంచి టచ్ లో ఉంది. రోసో బంగ్లాదేశ్ పై సెంచరీతో మెరిశాడు. డికాక్ కూడా టచ్ లో ఉన్నాడు. వీరితో పాటు హిట్టర్లు మిల్లర్, స్టబ్స్ ఉండనే ఉన్నారు. అయితే వీరి ప్రధాన సమస్య కెప్టెన్ బవుమా. గాయం నుంచి కోలుకుని వచ్చాక ఒక్కసారి కూడా మంచి ప్రదర్శన చేయలేదు. దాంతో అతడు జట్టుకు భారంగా మారాడు. అతడి స్థానంలో క్లాసెన్ ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మిల్లర్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా నోకియా , రబడ, ఎంగిడిలతో బలంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం పార్నెల్ స్థానంలో మార్కో యాన్సెన్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఈ మూడు విషయాలపై టీమిండియా ఫోకస్ పెట్టాల్సిందే

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్

First published:

Tags: India vs South Africa, KL Rahul, Mohammed Shami, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli