టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India) హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మెగా టోర్నీలో ఇప్పటికే ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్.. ఆదివారం కఠిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా (South Africa)తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితో భారత్ సెమీఫైనల్ కు దాదాపుగా చేరుకున్నట్లే. దాంతో భారత్ ఈ మ్యాచ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో బౌలర్లు పండగ చేసుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం గం. 4.30లకు ఆరంభం కానుంది. భారత్ తో పాటు సౌతాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత సఫారీ జట్టు పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సి ఉంది.
ఇక, టీమిండియాతో కీలక పోరుకు ముందు సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో భారత బ్యాటర్లకు మా పేస్ ఎటాక్ తో చుక్కలు చూపిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు.టీమిండియాకు తమ బౌలింగ్ అటాక్ తడాఖా చూపించబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రపంచంలోనే సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌ను ‘ది బెస్ట్’ అని అభివర్ణించిన నోర్ట్జె, తమ బౌలింగ్‌లో వైరుధ్యం ఉందని, అది ఎలాంటి బ్యాటర్లనయినా ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. వేగం, వైరుద్ధ్యం, లైన్ అండ్ లెంగ్త్.. ఇవన్నీ తమ బౌలింగ్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
" భారత్ తో జరగబోయే మ్యాచ్ మాకు చాలా కీలకం. ఈ మ్యాచులో మేము ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఫలితంగా పాయింట్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రతి పాయింట్ అవసరమే. ఏది ఏమైనా ఈసారి టీ20 ప్రపంచకప్‌ను కొట్టబోతోన్నాం.. " అని నోర్ట్జె కీలక వ్యాఖ్యలు చేశాడు.
Anrich Nortje challenges #TeamIndia ahead of the T20 World Cup clash against the Men in Blue‼️ "We definitely think that the last two seasons have been a great team, and hopefully, we can win the Cup this season."#T20WorldCup #INDvsSA #AnrichNortje pic.twitter.com/6g1dYgYqbL
— OneCricket (@OneCricketApp) October 29, 2022
ఇక టీమిండియా మూడు విభాగాల్ల ో మెరుగవ్వాల్సి ఉంది. ఓపెనింగ్, పవర్ ప్లే, డెత్ ఓవర్స్ లో భారత్ ఇంప్రూవ్ అవ్వాలి. గత రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ పవర్ ప్లేలో 6 కంటే తక్కవ రన్ రేట్ తో పరుగులు సాధించింది. ఓపెనర్లు ఇప్పటివరకు శుభారంభం చేయలేదు. ఇక డెత్ ఓవర్స్ లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli