T20 World Cup 2022 - Shaheen Afridi : టీమిండియా (Team India) వార్నింగ్ బెల్స్. అవును భారత బ్యాటర్లకు ఒకరకంగా ఇది వార్నింగ్ బెల్లే. భారత్ తో ప్రతిష్టాత్మక మ్యాచ్ కు ముందు తాను ఫుల్ ఫామ్ లోకి వచ్చానని పాకిస్తాన్ (Pakistan) పేసర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) చెప్పకనే చెప్పాడు. అఫ్గానిస్తాన్ (Afghanistan)తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది పదునైన బంతులతో రెచ్చిపోయాడు. గాయం తర్వాత అతడు ఆడుతున్న రెండో మ్యాచ్ ఇదే. అంతకుముందు ఇంగ్లండ్ తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో 2 ఓవర్లు మాత్రమే వేసిన అఫ్రిది కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక అఫ్గాన్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో ఫుల్ కోటా వేసి తాను ఫిట్ గా ఉన్నట్లు స్పష్టం చేశాడు.
అంతేకాకుండా తొలి ఓవర్లో అఫ్గాన్ డేంజరస్ బ్యాటర్ గుర్జాబ్ రహ్మనుల్లాను ఎల్బీగా అవుట్ చేశాడు. బుల్లెట్ లా వచ్చిన బంతి గుర్బాజ్ ఎడమ పాదాన్ని బలంగా తాకింది. దాంతో అతడు కాసేపు విలవిల్లాడాడు. నడవలేని స్థితిలో అతడిని సహచర ప్లేయర్ వీపుపై మోసుకెళ్లాడు. దాంతో గుర్బాజ్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం షాహీన్ హజ్రతుల్లా జజాయ్ (9)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కొత్త బంతితో రెండు ఓవర్లు వేసిన షాహీన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే ఓవరాల్ గా 4 ఓవర్లలో 4 ఓవర్లలో 29 పరుగులు సమర్పించుకున్నాడు. కొత్త బంతితో షాహీన్ అఫ్రిది, నసీం షా ప్రమాదకరంగా ఉండనున్నారు. రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీలకు వీరు సవాల్ విసిరే అవకాశం ఉంది. దాంతో భారత్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలి. ముఖ్యంగా యార్కర్లను ఆడటంలో ప్రాక్టీస్ చేయాలి.
4 Over 29 Runs 2 Early Wickets Yess Yess #ShaheenShahAfridi Is Officially Back ????❤️#PAKvAFG #T20WorldCup pic.twitter.com/GyYu39YarH
— Fan Girl ???????????? (@HafeezFanGirl) October 19, 2022
MY DEAR @ COACH I'M WORRIED FOR U ALREADY????????#PAKvAFG #ShaheenShahAfridi pic.twitter.com/WT3HJMYYsd
— NOT_YOUR_BOT_^^ (@Hamnayyy_00) October 19, 2022
మ్యాచ్ కు వాన గండం
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజు మెల్ బోర్న్ కు వర్షం సూచన ఉంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం నుంచి కూడా ఆస్ట్రేలియా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో టి20 ప్రపంచకప్ మ్యాచ్ లకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, IND vs PAK, India VS Pakistan, Pakistan, T20 World Cup 2022, Team India