IND vs PAK : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భాగంగా మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan)లు తాడో పేడో తేల్చుకోనున్నాయి. విఖ్యాత స్టేడియం ఎంసీజీ వేదికగా జరగనున్న ఈ గ్రూప్ ’2‘ పోరులో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు సీమర్లు, ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగనుంది. స్పిన్నర్ కోటాలో చహల్ కంటే కూడా అశ్విన్ కే రోహిత్ మొగ్గు చూపాడు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా భారత్ లానే 5గురు బ్యాటర్స్, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది.
ఫీల్డింగ్ ఎంచుకోవడానికి కారణం ఇదే
గత మూడు రోజులుగా ఎంసీజీ వికెట్ ను కవర్స్ తో కప్పి ఉంచారు. అదే సమయంలో పిచ్ పై పచ్చిక ఎక్కువగాా ఉంది. దాంతో ఆరంభంలో బ్యాటర్లకు పేస్ బౌలర్లను ఎదుర్కొనడంలో ఇబ్బంది ఉండొచ్చు. ఇందుకే తాను ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ టాస్ సమయంలో పేర్కొన్నాడు. అయితే పిచ్ రిపోర్ట్ సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్ మాత్రం టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. అయితే వర్షం పడే అవకాశాలు ఉండటం.. గ్రాస్ ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్ కు మొగ్గు చూపాడు.
ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. సీమర్లుగా షమీ, భునేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లను తీసుకుంది. హర్షల్ పటేల్ ను పక్కన పెట్టింది. ఇక స్పిన్నర్ విషయంలో అక్షర్ పటేల్ కు చోటు ఖాయం కాగా.. రెండో స్పిన్నర్ గా అశ్విన్ కు అవకాశం ఇచ్చింది. ఎక్స్ ట్రా బ్యాటర్ తో టీమిండియా బరిలోకి దిగుతుందని భావించినా.. ఇద్దరు స్పిన్నర్లతో ఆడేందుకే కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపాడు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్.
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికర్, షాహీన్ అఫ్రిది, రవూఫ్, నసీం షా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli