హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : భారత్ - పాక్ పోరంటే ఆ క్రేజే వేరప్పా.. ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..

IND vs PAK : భారత్ - పాక్ పోరంటే ఆ క్రేజే వేరప్పా.. ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..

IND vs PAK

IND vs PAK

IND vs PAK : నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఐసీసీ మెగా ట్రోఫీలు (ICC Trophies) కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ఈ మధ్యలో జరగడం అసంభవమే. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది.

ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2022) ప్రారంభం అవుతుంది. మెదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో శ్రీలంక్, నబేబియా, యూఏఈ, వెస్టిండీస్, నెదర్లాండ్, స్కాట్లండ్, జింబాబ్బే, ఐర్లాండ్ పాల్గొంటాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో నిర్వహిస్తున్నారు. 22న సూపర్ 12 మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది.

ఆ మరసటి రోజే భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. ఈ నె 23న దాయాది జట్లైన భారత్ పాక్ తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. ఈ మ్యాచుకు భారీగా స్పందన వస్తోంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ పోటీ పడుతున్నారు. ఓవరాల్ ట్వంటీ 20 ప్రపంచ కప్ సంబంధించి ఇప్పటికే 600,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం తెలిపింది.

ఇది కూడా చదవండి : కప్పు ముఖ్యం బిగులు.. ఈ సవాళ్లను అధిగమించకపోతే రోహిత్ కు కష్టాలే!

అయితే, మెల్ బోర్న్ వేదిక ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ సంబంధించి ఇప్పటికే 90,000 వేలకు పైగా టికెట్లు అమ్మినట్లు అధికారులు తెలిపారు. అంటే, ఒక భారత్ - పాక్ మ్యాచుకే లక్ష టికెట్లు అమ్ముడుపోయాయ్. దీంతో, ఈ మ్యాచుకున్న క్రేజ్ చూసి ఫ్యాన్స్ తో పాటు ఆస్ట్రేలియా అధికారులు కూడా అవాక్కవుతున్నారు. ఈ క్రేజ్ ను కాస్తా టిక్కెట్ల రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు.

First published:

Tags: Babar Azam, Cricket, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు