హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ Warm Up Match : ఆలస్యంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. కారణం ఇదే

IND vs NZ Warm Up Match : ఆలస్యంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. కారణం ఇదే

PC : TWITTER

PC : TWITTER

T20 World Cup 2022 - IND vs NZ Warm Up Match : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత (India), న్యూజిలాండ్ (New Zealand) వార్మప్ మ్యాచ్ కు వర్షం అడ్డుగా నిలిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 - IND vs NZ Warm Up Match : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత (India), న్యూజిలాండ్ (New Zealand) వార్మప్ మ్యాచ్ కు వర్షం అడ్డుగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఇదే పిచ్ పై జరిగిన పాకిస్తాన్ (Pakistan), అఫ్గానిస్తాన్ (Afghanistan) మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. అనంతరం వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ నెల 22 నుంచి సూపర్ 12 దశ ఆరంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియాకు ఇదే ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్. అయితే వర్షం కారణంగా అది జరిగే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి : శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ.. కీలక బౌలర్ కు గాయం.. టోర్నీలో ఆడేది అనుమానమే

వారికి అవకాశం దక్కుతుందా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ పోరులో భారత్ ఒక పక్కా ప్రణాళికతో ఆడింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా.. పాకిస్తాన్ తో ఆడే తుది ఎలెవెన్ తోనే ఆడింది. దాంతో తొలి మ్యాచ్ లో దీపక్ హుడాతో పాటు రిషభ్ పంత్ లాంటి ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అదే సమయంలో బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ వారికి అవకాశం ఇస్తుందా.. లేక పాక్ తో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ తోనే ఆడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇక ఆఖరి ఓవర్ వేసిన షమీ తన ఫిట్ నెస్ పై వస్తున్న సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ లో పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇరు జట్ల ఫామ్ ను బట్టి చూస్తే న్యూజిలాండ్ కంటే కూడా భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. సౌతాఫ్రికాతో జరిగిన తమ ఆరంభ పోరులో న్యూజిలాండ్ దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 100 పరుగులు కూడా చేయలేకపోయింది. దాంతో ఈ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంది.

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, దీపక్ హుడా, అశ్విన్, షమీ, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్.

First published:

Tags: Axar Patel, India vs newzealand, Kane Williamson, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు