IND vs NED : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) మరో సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. సూపర్ 12లో భాగంగా నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన గ్రూప్ ‘2’ పోరులో భారత్ (India) గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై ఘనవిజయం సాధించింది. 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. టిమ్ ప్రింగిల్ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లు తలా రెండు వికెట్ల చొప్పున సాధించారు. షమీకి ఒక వికెట్ దక్కింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. విక్రమ్ జిత్ సింగ్ (1)ని భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అనంతరం మ్యాక్స్ ఓ డౌడ్ (16), బాస్ డీ లిడ్ (16) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. వీరిద్దరిని అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. కోలిన్ అకర్ మన్ (17)తో పాటు కీలక బ్యాటర్ టామ్ కూపర్ (9), కెప్టెన్ ఎడ్వర్డ్స్ (5) అలా వచ్చి ఇలా వెళ్లారు. చివర్లో ప్రింగిల్, షరీజ్ అహ్మద్ (16 నాటౌట్), పాల్ వాన్ మెకెరెన్ (14 నాటౌట్) అడపాదడపా బౌండరీలు బాదడంతో నెదర్లాండ్స్ 100 పరుగుల మార్కును దాటింది.
A comprehensive win for India at the SCG against Netherlands ????????#NEDvIND | #T20WorldCup | ????: https://t.co/9FPx3tOBBe pic.twitter.com/1a9Nz0sOiM
— ICC (@ICC) October 27, 2022
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ ( 44 బంతుల్లో 64 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ ( 39 బంతుల్లో 53 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ ( 25 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్ ) మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో మెకరీన్, క్లాసెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా పవర్ ప్లేలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది అయితే ఇన్నింగ్స్ 10వ ఓవర్ నుంచి రోహిత్ రెచ్చిపోయాడు. భారీ షాట్లతో పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరింతగా రెచ్చిపోయాడు. సూర్యకుమార్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓ ఔండరీ, సిక్సర్ తో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆ తర్వాత సూర్య కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Hardik Pandya, KL Rahul, Netherlands, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli