టీ20 వరల్డ్ కప్ -2022 (T20 World Cup 2022) వేటను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) ను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. మెల్బోర్న్ మ్యాచ్ నరాలు తెగేంతగా ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) మ్యాచ్‌ని మలుపు తిప్పడమే కాకుండా 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 40 పరుగులతో సత్తా చాటాడు. ఫస్ట్ మ్యాచులో గెలిచిన టీమిండియా ఈ నెల 27న నెదర్లాండ్స్ తో (India vs Netherlands) అమీతుమీ తేల్చుకోనుంది.
పాకిస్తాన్ పై గెలిచినంత మాత్రాన డచ్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచూ కీలకమే. దీంతో.. నెదర్లాండ్స్ ను తక్కువ అంచన వేయకుండా పోరాడితే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ మ్యాచుకు టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
పాకిస్తాన్ తో జరిగిన ఓపెనింగ్ మ్యాచులో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఫెయిలయ్యారు. దీంతో.. ఈ ముగ్గురు నెక్ట్స్ మ్యాచుకు కచ్చితంగా అందుబాటులో ఉంటారు. సౌతాఫ్రికాతో కీలక మ్యాచుకు ముందు ఈ ముగ్గురు నెదర్లాండ్స్ గేమ్ ను కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక, విరాట్ కోహ్లీ , హార్దిక్ లు కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. దినేష్ కార్తీక్ కు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే, పాక్ పై ఫెయిలైన అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలని రోహిత్ శర్మ, ద్రవిడ్ లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నెదర్లాండ్స్ పై పంత్ కి చోటిస్తే.. అతను తిరిగి లయ అందుకునే ఛాన్సు ఉంది. దీంతో, అక్షర్ పై వేటు పడే ఛాన్సుంది. ఇక, బౌలింగ్ లైనప్ లో కూడా మార్పులు జరగనున్నాయి. మహ్మద్ షమీకి ఈ మ్యాచులో విశ్రాంతి కల్పించనున్నారు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ చాహల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : వదల బొమ్మాళీ వదల అంటోన్న డెత్.. దృష్టి పెట్టకపోతే టీమిండియాకు కష్టమే
భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లు కొత్త బంతిని పంచుకోనున్నారు. మహ్మద్ షమీకి విశ్రాంతి కల్పించడంతో.. మూడో పేసర్ గా హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయనున్నాడు. పాక్ మ్యాచులో హార్దిక్ మూడు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక, అశ్విన్ పాక్ మ్యాచులో రాణించాడు. దీంతో, అతను తుది జట్టులో స్థానం నిలుపుకోవడం ఖాయం. ఇక, నెదర్లాండ్స్ జట్టులో టీ20 ప్రపంచకప్ లో ఇంతవరకు టీమిండియాతో తలపడింది లేదు.
భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ / అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ/ యుజువేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Cricket, Mohammed Shami, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli