IND vs NED : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాడ్ ఫామ్ కొనసాగుతుంది. సూపర్ 12లో భాగంగా గత ఆదివారం జరిగిన పోరులో 4 పరుగులకు అవుటయ్యాడు. ఇక నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగే మ్యాచ్ లోనైనా రాణించి ఫామ్ లోకి వస్తాడని అంతా అనుకున్నారు. అయితే నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో కూడా రాహుల్ నిరాశ పరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే ఈసారి రాహుల్ ను దురదృష్టం వెంటాడింది. నాటౌట్ కు అవుట్ గా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రాహుల్, రోహిత్ లు వచ్చారు.
మెకరీన్ 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ మూడో బంతికి మెకరీన్ ఇన్ స్వింగర్ వేశాడు. బంతి లోపలికి రావడంతో రాహుల్ దానిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో బంతి ప్యాడ్ కు తాకింది. వెంటనే మెకరీన్ తో పాటు ఇతర నెదర్లాండ్స్ ప్లేయర్స్ ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. చాలా సేపు ఆలోచించిన అంపైర్ రాహుల్ ను అవుట్ గా ప్రకటించాడు. ఆ లేట్ కాల్ కు కామెంటేటర్లు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వెంటనే రాహుల్ రివ్యూకు వెళ్తాడని అనుకున్నారు. అయితే నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న రోహిత్ తో రాహుల్ చర్చించాడు. రోహిత్ లెగ్ స్టంప్ ను తాకొచ్చని చెప్పాడు. అంపైర్స్ కాల్ ఉండొచ్చు.. రివ్యూ అనవసరం అన్నట్లు ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దాంతో రాహుల్ పెవిలియన్ కు నిరాశగా వెళ్లిపోయాడు.
KL Rahul missed a big opportunity by not taking the review. pic.twitter.com/CsA4uQcpEE
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
అయితే అనంతరం హాక్ ఐలో ఆ బంతి లెగ్ స్టంప్ ను మిస్ అవుతున్నట్లు తేలింది. దాంతో డగౌట్ లో ఉన్న రాహుల్ అయ్యో అన్నట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. రివ్యూ తీసుకుని ఉంటే రాహుల్ తప్పుకుండా బతికిపోయాడు. అయితే రివ్యూ తీసుకోకపోవడం వల్ల బలయ్యాడు. ఇక కాసేపటికే మరోసారి అంపైర్ తప్పుగా రోహిత్ ను అవుట్ గా ప్రకటించాడు. రివ్యూకు వెళ్లిన రోహిత్ అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. రోహిత్ ఎల్బీ కోసం నెదర్లాండ్స్ ప్లేయర్స్ అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటని ప్రకటించాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్ ను తాకిందని స్పష్టంగా కనిపించింది. దాంతో రోహిత్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, KL Rahul, Netherlands, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli