టీ20 వరల్డ్ కప్ 2022లో మరో ఆసక్తికర పోరు రంగం సిద్దమైంది. పాకిస్తాన్ ను తమ ఫస్ట్ మ్యాచులోనే ఓడించి మెగా టోర్నీ ఘనంగా ప్రారంభించిన టీమిండియాతో నెదర్లాండ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఇక, టీమిండియా అదే జట్టుతో బరిలోకి దిగుతుంది. ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. నెదర్లాండ్స్ జట్టు కూడా సేమ్ టీమ్ తో బరిలోకి దిగుతోంది. రిషబ్ పంత్ కు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇక, టీ20 వరల్డ్ కప్ -2022(T20 World Cup 2022) వేటను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) ను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక, ఈ మ్యాచులో కూడా టీమిండియా భారీ పరుగుల తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్ పై గెలిచినంత మాత్రాన డచ్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచూ కీలకమే. దీంతో.. నెదర్లాండ్స్ ను తక్కువ అంచన వేయకుండా పోరాడితే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
Toss news ???? India have opted to bat first against Netherlands in Sydney.#T20WorldCup #NEDvIND pic.twitter.com/6tK3U7ndHl
— T20 World Cup (@T20WorldCup) October 27, 2022
పాకిస్తాన్ తో జరిగిన ఓపెనింగ్ మ్యాచులో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఫెయిలయ్యారు. దీంతో.. ఈ ముగ్గురు సద్వినియోగం చేసుకోవాలి. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరూ అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలి. దినేశ్ కార్తీక్ కూడా కీలక మ్యాచులకు ముందు ఈ మ్యాచును సద్వినియోగం చేసుకోవాలి.భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్ లు కొత్త బంతిని పంచుకోనున్నారు. మహ్మద్ షమీ, అశ్విన్, అక్షర్ పటేల్ ఈ మ్యాచులో కూడా సత్తా చాటాలి.
నెదర్లాండ్స్ జట్టులో మ్యాక్స్ ఓడ్, కొలీన్ అకర్మెన్, స్కాట్ ఎడ్వర్డ్స్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. సూపర్ -12 స్టేజీలో తమ ఫస్ట్ మ్యాచులో బంగ్లా చేతిలో ఓడిపోయింది డచ్ టీమ్. బౌలింగ్ లో సత్తా చాటుతున్న బ్యాటింగ్ లో చేతులేత్తేస్తున్నారు. ఇక, టీ20 మెగా టోర్నీలో నెదర్లాండ్స్, టీమిండియా తలపడనుండటం ఇదే తొలిసారి.
తుది జట్లు :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్
నెదర్లాండ్స్ : విక్రమ్ జీత్ సింగ్, మ్యాక్స్ ఓడ్, బాస్ డీ లీడ్, కొలీన్ అకర్మెన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), టిమ్ ప్రింగిల్, లోగన్ వాన్ బీక్, రోలఫ్ వాన్ డర్వ్ మెర్వ్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెక్రీన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, KL Rahul, Netherlands, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli