హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 - IND vs NED : కోహ్లీ, రోహిత్, సూర్య హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్..

T20 World Cup 2022 - IND vs NED : కోహ్లీ, రోహిత్, సూర్య హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్..

PC : ICC

PC : ICC

T20 World Cup 2022 - IND vs NED : రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ ల క్లాసిక్ బ్యాటింగ్ తో టీమిండియా మంచి స్కోరు సాధించింది. ఇక, బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న పోరులో టీమిండియా మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ ( 44 బంతుల్లో 64 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ ( 39 బంతుల్లో 53 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ ( 25 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్ ) మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో మెకరీన్, క్లాసెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. వాన్ మెకరీన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయడానికే నానా తంటాలు పడ్డారు. నెదర్లాండ్స్ ఫీల్డర్ల వైఫల్యం వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ బతికిపోయాడు. లేకపోతే.. తక్కువ స్కోరుకే ఔటయ్యేవాడు. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా పవర్ ప్లేలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది.

అయితే, పవర్ ప్లే తర్వాత రోహిత్ శర్మ వేగం పెంచాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో కోహ్లీ కూడా బాల్ ను మిడిల్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత క్లాసన్ బౌలింగ్ లో అకర్మెన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో..84 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

అయితే, సూర్యకుమార్ యాదవ్ రాకతో స్కోరు బోర్డు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. సూర్యకుమార్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓ ఔండరీ, సిక్సర్ తో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆ తర్వాత సూర్య కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తుది జట్లు :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్

నెదర్లాండ్స్ : విక్రమ్ జీత్ సింగ్, మ్యాక్స్ ఓడ్, బాస్ డీ లీడ్, కొలీన్ అకర్మెన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), టిమ్ ప్రింగిల్, లోగన్ వాన్ బీక్, రోలఫ్ వాన్ డర్వ్ మెర్వ్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెక్రీన్

First published:

Tags: Cricket, Netherlands, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు