IND vs ENG 2nd Semi Final : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 చివరి ఘట్టానికి చేరుకుంది. 12 జట్లతో ఆరంభమైన సూపర్ 12 ముగిసింది. గ్రూప్ ‘1’, గ్రూప్ ‘2’ లలో టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ (New Zealand), ఇంగ్లండ్ (England) జట్లు సెమీస్ చేరగా.. గ్రూప్ 2 నుంచి భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు సెమీస్ చేరాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ తో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 10న జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో భారత్ తాడో పేడో తేల్చుకుంటుంది. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ కు భారీ షాట్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ గాయంతో భారత్ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా తరుపుముక్క ఇతడే
సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో శ్రీలంకతో ఇంగ్లండ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్ గాయపడ్డాడు. గజ్జల్లో అతడికి గాయం అవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. ఇక ఇంగ్లండ్ ఛేదన ఆరంభించగా.. ఓపెనర్లు శుభారంభం చేశారు. అయితే ఓపెనర్లు పెవిలియన్ కు చేరాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. కీలక సమయంలో కూడా మలాన్ బ్యాటింగ్ కు రాలేదు. చివరకు వోక్స్ తో కలిసి స్టోక్స్ ఇంగ్లండ్ ను గెలిపించాడు. భారత్ తో జరిగే మ్యాచ్ లో మలాన్ ఆడతాడా? లేదా? అనే అంశంపై ఇంగ్లండ్ బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలంకతో మ్యాచ్ నవంబర్ 5న జరగ్గా.. భారత్ తో సెమీస్ మ్యాచ్ 10వ తేదీన జరగనుంది. ఈ క్రమంలో మలాన్ కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం దొరికింది. అయితే మలాన్ గాయం కాస్త తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో భారత్ తో జరిగే సెమీస్ పోరులో మలాన్ ఆడే అవకాశం దాదాపుగా లేనట్లే. అయితే ఇంగ్లండ్ టీం మాత్రం ఇప్పటి వరకు అతడి గాయంపై అధికారిక ప్రకటన చేయలేదు.
సాల్ట్ కు అవకాశాం!
టి20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్ తో జరిగిన 7 మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఫిల్ సాల్ట్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. సాల్ట్ కూడా మలాన్ లాగే లెఫ్టాండ్ బ్యాటర్ దాంతో భారత్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో సాల్ట్ కు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఇక ఇంగ్లండ్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్లుగా డాసన్, గ్లీసన్ లు ఉన్నారు. మలాన్ టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నట్లు అయితే వీరిలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, England, Hardik Pandya, India vs england, New Zealand, Pakistan, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli