టీ20 ప్రపంచకప్ 2022 (T20 World cup 2022) టోర్నమెంట్లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. అయితే, ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గాయపడ్డ డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ స్థానాల్లో ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ ల్ని జట్టులోకి తీసుకుంది.15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. మెగా టైటిల్ కరువు తీర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది రోహిత్ సేన. అయితే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు స్ట్రాంగ్ గా ఉండటంతో టీమిండియాకు గట్టి పోటీ తప్పేలా లేదు.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఇంత వరకు ఒక మ్యాచులో కూడా మంచి ఆరంభాన్ని అందించలేదు. రోహిత్ రాణిస్తే .. కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఇక, కేఎల్ రాహుల్ రాణిస్తే.. రోహిత్ నిరాశపర్చాడు. ఇక, కీలక సెమీస్ లో ఈ ఇద్దరూ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలోనే సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ మరోసారి చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కీలక మ్యాచులో హార్దిక్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్ లో ఫర్వాలేదన్పిస్తున్నా.. బ్యాటింగ్ లో మాత్రం నిరాశపరుస్తున్నాడు.
England have opted to bowl against India in Adelaide ???? Who are you rooting for?#T20WorldCup | #INDvENG | ????: https://t.co/PgKzpNrdvB pic.twitter.com/nMt7e8Orjr
— ICC (@ICC) November 10, 2022
మెరుపు బ్యాటింగ్ తో క్షణాల్లో ఆటను మార్చే హార్దిక్ పాండ్యా.. ఈ మెగాటోర్నీలో అంతగా మెరిపించలేదు. బౌలింగ్‌లో భువీ, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగంలో దుమ్మురేపుతున్నారు. అదే ఫామ్ ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే, టీమిండియా స్పిన్ విభాగం అనుకున్నతంగా రాణించలేదు. అయితే, కీలక మ్యాచులో అశ్విన్ సత్తా చాటాల్సి ఉంది. స్పిన్ బాగా ఆడే ఇంగ్లండ్ జట్టును అశ్విన్ ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి.
మరోవైపు.. ఇంగ్లండ్ జట్టు కూడా భీకరంగా ఉంది. కెప్టెన్ జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఈ ఫార్మాట్ లో డేంజరస్ ప్లేయర్స్. క్షణాల్లో ఆటను మార్చగలరు. ఇక, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ వంటి డేంజరస్ బ్యాటర్లు కూడా ఆ జట్టు సొంతం. భారత్ కంటే ఇంగ్లిష్ జట్టే బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. సామ్‌కరన్, మార్క్ వుడ్ వికెట్ల వేటలో ముందు ఉన్నారు. ముఖ్యంగా సామ్ కరన్ పేస్ అటాకింగ్‌తో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక వుడ్ విషయానికి వస్తే..మెరుపు వేగంతో లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలు వేయడం అతని ప్రత్యేకత.
వరల్డ్ క్రికెట్లోని టాప్ ఆల్ రౌండర్లలో బెన్ స్టోక్ ఒకడు. బ్యాటింగ్‌తో పాటు అద్భుతంగా ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. మరో ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. దీంతో భారత్ తొలి ఆరు ఓవర్లలో శుభారంభం లభించడం అంత సులభం కాదు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ బౌలర్లు ఏ మ్యాచ్‌లోనూ ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. పైగా చాలా మంది ఆల్ రౌండర్లు ఉండటం ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం.
తుది జట్లు :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్
ఇంగ్లండ్ : అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, ఫిల్ సాల్ట్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Mohammed Shami, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli