Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs BAN : కీలక పోరులో టాస్ ఓడిన టీమిండియా.. పంత్ కు మరోసారి నిరాశ.. తుది జట్లు ఇవే

IND vs BAN : కీలక పోరులో టాస్ ఓడిన టీమిండియా.. పంత్ కు మరోసారి నిరాశ.. తుది జట్లు ఇవే

PC : ICC

PC : ICC

IND vs BAN : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో టీమిండియా (Team India) కీలకపోరుకు సిద్ధమైంది. టోర్నీని ఘనంగా ఆరంభించిన భారత్ కు సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఎదురైన ఓటమి కాస్త నిరాశకు గురి చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs BAN : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో టీమిండియా (Team India) కీలకపోరుకు సిద్ధమైంది. టోర్నీని ఘనంగా ఆరంభించిన భారత్ కు సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఎదురైన ఓటమి కాస్త నిరాశకు గురి చేసింది. సెమీఫైనల్ చేరాలంటే ఇకపై జరిగే రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంది. ఈ క్రమంలోనే అడిలైడ్ వేదికగా సూపర్ 12 గ్రూప్ ‘2’లో బంగ్లాదేశ్ (Bangladesh)తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే భారత్ సెమీఫైనల్ కు మరింత చేరువ అవుతుంది. ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాంను తుది జట్టులోకి తీసుకుంది.

పంత్ కు మరోసారి నిరాశ

గత మ్యాచ్ లో కీపింగ్ చేస్తూ దినేశ్ కార్తీక్ గాయపడ్డ సంగతి తెలిసిందే. దాంతో అతడి స్థానంలో పంత్ చివరి ఓవర్లలో కీపింగ్ కూడా చేశాడు. ఇక ఈ మ్యాచ్ కోసం పంత్ తుది జట్టులోకి వస్తాడని అంతా అనుకున్నారు. అయితే కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మలు మాత్రం అందుకు విరుద్దంగా ఆలోచించారు. పంత్ ను మరోసారి పక్కన పెట్టారు. గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడాను పక్కన పెట్టారు. అతడి స్థానాన్ని మళ్లీ అక్షర్ పటేల్ కే ఇచ్చారు. అయితే అక్షర్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్లకు మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటాడు. కానీ, బంగ్లా జట్టులో ఏకంగా నలుగురు లెఫ్టాండర్లు ఉన్నారు. దాంతో అక్షర్ పటేల్ బదులు రిషభ్ పంత్ కు అవకాశం ఇవ్వాల్సింది. దక్షిణాఫ్రికా జట్టులో లెఫ్టాండర్లు ఎక్కువగా ఉన్నారన్న కారణంతోనే గత మ్యాచ్ లో అక్షర్ ను టీమిండియా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడ అందుకు విరుద్దంగా నిర్ణయం తీసుకుంది.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్,  అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్

బంగ్లాదేశ్

షకీబుల్ హసన్ (కెప్టెన్), షాంటో, లిట్టన్ దాస్, అఫిఫ్, యాసిర్ అలీ, మొసదిక్, నురుల్ హసన్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రహ్మాన్

First published:

Tags: Hardik Pandya, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు