అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న పోరులో టీమిండియా విక్టరీ కొట్టింది. వర్షం వల్ల ఆగిపోయి తిరిగి ప్రారంభమైన ఈ మ్యాచులో బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో నెగ్గింది టీమిండియా. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 16 వ ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసింది. లిటన్ దాస్ ( 27 బంతుల్లో 60 పరుగులు ; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో నురుల్ హసన్ (14 బంతుల్లో 25 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించిన ఫలితం లేకపోయింది. శాంటో (25 బంతుల్లో 21 పరుగులు ; 1 ఫోర్, 1 సిక్సర్ ) ఫర్వాలేదన్పించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. మహ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది. అయితే, 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 66 పరుగులు చేసింది. అయితే, ఈ సమయంలో వర్షం రావడంతో కాసేపు మ్యాచు ఆగిపోయింది. ఆ తర్వాత కాసేపటికి వర్షం ఆగిపోయింది. దీంతో ..మ్యాచును 16 వ ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ కు కుదించారు.
185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్ లిటన్ దాస్ రెచ్చిపోవడంతో బంగ్లా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రెండో ఓవర్ నుంచి లిటన్ విశ్వరూపం చూపించాడు. బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అన్నట్టు సాగింది అతని బ్యాటింగ్. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో నజముల్ హసన్ స్రోకు చేయడానికే నానా తంటాలు పడ్డాడు. అయితే.. లిటన్ దాస్ దూకుడుతో 7 ఓవర్లలో 66 పరుగులు చేసింది బంగ్లాదేశ్. అయితే.. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.
A brilliant performance after the rain break from India ⚡
India are #InItToWinIt@royalstaglil | #T20WorldCup pic.twitter.com/fa6kAAoMep — ICC (@ICC) November 2, 2022
దీంతో.. కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభం అయ్యే సమయానికి ఓవర్లతో పాటు టార్గెట్ ను కుదించారు అంపైర్లు. టార్గెట్ ను 16 ఓవర్లలో 151 గా రివైజ్ చేశారు. దీంతో.. 9 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి వచ్చింది బంగ్లాదేశ్. అయితే, వర్షం ఆగిపోయిన తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు షాక్ తగిలింది. 27 బంతుల్లో 60 పరుగులు చేసిన లిటన్ దాస్ కేఎల్ రాహుల్ సూపర్ రనౌట్ తో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. ఆ తర్వాత నజముల్ హెస్సేన్ శాంటో కూడా షమీ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్.
ఆ తర్వాత అశ్విన్ ఓవర్ లో రెండు బౌండరీలు కొట్టి.. రన్ రేట్ ను కంట్రోల్ లో ఉంచాడు బంగ్లా కెప్టెన్ షకీబ్. అయితే, ఆ కాసేపటికే బంగ్లా మరో వికెట్ కోల్పోయింది అఫిఫ్ హెస్సేన్ 3 పరుగులు చేసి అర్ష్ దీప్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కాసేపటికే.. షకీబ్ కూడా అర్షదీప్ బౌలింగ్ లో నే ఔటయ్యాడు. 13 బంతుల్లో 13 పరుగుల చేసిన షకీబ్ .. దీపక్ హుడాకి క్యాచ్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో .. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో యాసిర్ అలీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.
దీంతో.. 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక, హార్దిక్ అదే ఓవర్ లో మొసాదిక్ హెస్సేన్ ను ఔట్ చేశాడు. హెస్సేన్ ఆరు పరుగులు చేశాడు. ఇక, ఆఖరి మూడు ఓవర్లలో 43 పరుగులు అవసరమయ్యాయి. అయితే.. హార్దిక్ పాండ్యా వేసిన 15 వ ఓవర్ లో టస్కిన్ అహ్మద్ ఫోర్, సిక్సర్ కొట్టడంతో మొత్తం పరుగులు వచ్చాయి. దీంతో.. ఆఖరి ఓవర్ లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన అర్ష్ దీప్ బౌలింగ్ లో నురుల్ హసన్ సిక్సర్, బౌండరీ బాదడంతో ఆఖరి బంతికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఆఖరి బంతికి నురుల్ హసన్ ఒక పరుగు మాత్రమే చేశాడు. దీంతో, టీమిండియా విక్టరీ కొట్టింది.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 61 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 పరుగులు ; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (6 బంతుల్లో 13 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. అయితే, రోహిత్ శర్మ (2), హార్దిక్ పాండ్యా (5), దినేశ్ కార్తీక్ (7) మరోసారి నిరాశపర్చారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs bangladesh, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli