హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 - IND vs BAN : వరుణుడు ఎంట్రీ.. టెన్షన్ లో టీమిండియా.. మ్యాచ్ రద్దయితే బంగ్లాదే గెలుపు!

T20 World Cup 2022 - IND vs BAN : వరుణుడు ఎంట్రీ.. టెన్షన్ లో టీమిండియా.. మ్యాచ్ రద్దయితే బంగ్లాదే గెలుపు!

IND vs BAN

IND vs BAN

T20 World Cup 2022 - IND vs BAN : 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 66 పరుగులు చేసింది. దీంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా కంటే 17 పరుగుల ముందంజలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచు ఆగిపోతే.. టీమిండియా ఓడిపోతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీ20 ప్రపంచకప్ లో మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వరుణుడు ఎంట్రీతో టీమిండియా - బంగ్లాదేశ్ మ్యాచు ఆగిపోయింది. అయితే, 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 66 పరుగులు చేసింది. దీంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా కంటే 17 పరుగుల ముందంజలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచు ఆగిపోతే.. టీమిండియా ఓడిపోతుంది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (26 బంతుల్లో 59 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతని విధ్వంసానికి టీమిండియా బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. వర్షం ఆగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేకపోతే టీమిండియాకు భారీ నష్టం తప్పదు. ఈ మ్యాచులో ఓడిపోతే.. టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి.

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 61 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 పరుగులు ; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (6 బంతుల్లో 13 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. అయితే, రోహిత్ శర్మ (2), హార్దిక్ పాండ్యా (5), దినేశ్ కార్తీక్ (7) మరోసారి నిరాశపర్చారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపర్చాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హసన్ మహ్మద్ బౌలింగ్ లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కోహ్లీతో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో వరుసగా విఫలమవుతున్న రాహుల్ ఈ మ్యాచులో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో చెలరేగాడు.

మరో ఎండ్ లో కోహ్లీ.. రాహుల్ కి మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక, కేఎల్ రాహుల్ ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న రాహుల్ ని బంగ్లా కెప్టెన్ షకీబ్ బోల్తా కొట్టించాడు. షకీబ్ బౌలింగ్ లో ముస్తఫిజుర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 78 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన ఫాంను ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేశాడు.

రావడం రావడంతోనే క్లాసిక్ బౌండరీలు కొట్టి టీమిండియా స్కోరు బోర్డులో వేగం పెంచాడు. మరో ఎండ్ లో కోహ్లీ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. అయితే 16 బంతుల్లో 30 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ జోరుకు షకీబ్ కళ్లెం వేశాడు. షకీబ్ బౌలింగ్ లో సూర్య క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. 116 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మరోసారి నిరాశపర్చాడు. ఐదు పరుగులు చేసిన హార్దిక్ .. హసన్ మహ్మద్ బౌలింగ్ లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత కోహ్లీ 37 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో కోహ్లీకి ఇది మూడో హాఫ్ సెంచరీ. అయితే, ఏడు పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆఖర్లో వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోయింది. అయితే, కోహ్లీ.. అశ్విన్ తో కలిసి ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో, టీమిండియా భారీ స్కోరు సాధించింది.

First published:

Tags: India vs bangladesh, KL Rahul, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు