టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) రసవత్తరంగా సాగుతుంది. సెమీస్ లెక్కలు మొదలయ్యాయి. సెమీస్ రేసులో నిలవడం కోసం ప్రతి జట్టు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇక, సౌతాఫ్రికాపై ఓటమి తర్వాత టీమిండియా (Team India) కూడా సెమీస్ కు వెళ్లాలంటే కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.టీమిండియా తమ నెక్ట్స్ రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేతో తలపడనుంది. పేపర్ మీద.. ఈ రెండు జట్ల కన్నా టీమిండియా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే, ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు అంటూ ఎవరూ లేరు. చిన్న జట్లు కూడా బిగ్ టీమ్స్ ని ఓడించి సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ నెల 2 అంటే బుధవారం.. టీ20 ప్రపంచ కప్ 2022 లో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను అడిలైడ్‌లో బంగ్లాదేశ్ టీంతో (India vs Bangladesh) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్లకు చాలా కీలకం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా గెలవకపోతే మాత్రం.. భారీ నష్టం చవిచూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచులో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్ ల్లో కార్తీక్ ఆడడంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ వరల్డ్ కప్ కార్తీక్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నాడు.
ఇక, గత మ్యాచులో జట్టులోకి వచ్చిన దీపక్ హుడాని పక్కన పెట్టే అవకాశం కన్పిస్తుంది. దీపక్ హుడా గత మ్యాచులో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలాగే, బౌలింగ్ లో కూడా అతనికి అవకాశం రాలేదు. అతన్ని పక్కన పెట్టి.. అక్షర్ పటేల్ ని మరోసారి జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు అనుకున్నంతగా రాణించలేదు. రోహిత్ కి మంచి ఆరంభాలు లభిస్తున్నా.. వాటిని పెద్ద ఇన్నింగ్సులుగా మార్చడంలో విఫలమవుతున్నాడు.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతవరకు డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు కేఎల్ రాహుల్. దీంతో.. ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ రాణించాల్సింది అవసరం ఉంది. ఇక, మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ , విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కీలకం కానున్నారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో విఫలమయ్యారు. అయితే, సూర్యకుమార్ యాదవ్ మాత్రం సూపర్ హాఫ్ సెంచరీతో టీమిండియాకు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు ఖాయం అన్న ధీమా అభిమానుల్లో ఉంది.
బౌలింగ్ లో భువనేశ్వర్, షమీ, అర్ష్ దీప్ సింగ్ లు అద్బుతంగా రాణిస్తున్నారు. ఈ ముగ్గురు మరోసారి కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తే బంగ్లా బ్యాటింగ్ లైనప్ కు తిప్పలు తప్పవు. అయితే, టీమిండియాను స్పిన్ విభాగం భయపెడుతుంది. ఈ మెగాటోర్నీలో టీమిండియా స్పిన్నర్లు తేలిపోయారు. గత మ్యాచులో అశ్విన్ భారీగా పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. అయితే, బంగ్లా జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉండటంతో అతన్ని తుది జట్టులో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లేకపోతే యుజువేంద్ర చాహల్ తుది జట్టులోకి రానున్నాడు.
టీమిండియా తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ / రిషబ్ పంత్, దీపక్ హుడా / అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ / చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, India vs bangladesh, Rishabh Pant, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli