టి20 ప్రపంచకప్ (T20 World Cup) వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ వార్మప్ మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది. ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఒక్క ఓవర్ వేసిన షమీ టీమిండియాకు విజయాన్నందించాడు. 187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఫించ్ ( 54 బంతుల్లో 76 పరుగులు), మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35 పరుగులు) సత్తా చాటారు. షమీ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. ఓ దశలో ఈ మ్యాచులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగగా.. ఓ అద్భుతమైన రనౌట్, క్యాచుతో మ్యాచును మలుపు తిప్పాడు కోహ్లీ.
187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మిచెల్ మార్ష్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరి దూకుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా మిచెల్ మార్ష్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35 పరుగులు) ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ ఔటైన కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుగానే ఆడాడు.
అయితే, స్టీవ్ స్మిత్ మాత్రం వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 11 పరుగులు చేసిన స్మిత్ చాహల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత మ్యాక్సీ, ఫించ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు తీసింది. ఇక, ఆఖరి ఓవర్ లో 10 పరుగులు అవసరమవ్వగా షమీ అద్భుతమైన బౌలింగ్ వేసి టీమిండియాను గెలిపించాడు. ఈ ఓవర్ లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి.. నాలుగు వికెట్లు పడ్డాయి. షమీ మూడు వికెట్లు తీశాడు.
India win a thriller! They beat Australia by 6 runs during their warm-up fixture in Brisbane ???? #T20WorldCup | Scorecard: https://t.co/axrcp7psif pic.twitter.com/xPRsEGcdjG
— T20 World Cup (@T20WorldCup) October 17, 2022
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్ ) రాణించారు. కార్తీక్ (20 పరుగులు), కోహ్లీ (19 పరుగులు), రోహిత్ (15 పరుగులు) ఫర్వాలేదన్పించారు. హార్దిక్ పాండ్యా మాత్రమే రెండు పరుగులు చేసి నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్ నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. స్టార్క్, మ్యాక్స్ వెల్, ఆగర్ చెరో వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs australia, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli