T20 WORLD CUP 2022 ICC CONFIRMED VENUES FOR THE MEGA TROPHY KEY UPDATE COMING SHORTLY SRD
T20 World Cup 2022 : మెగాటోర్నీ కోసం ఏడు వేదికలు ఖరారు.. ఈ నెల 21న కీలక అప్ డేట్..
T20 World Cup 2022
T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య ఐసీసీ 2022 టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. అయితే, కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2021లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా టోర్నీ కోసం వేదికలు ఖరారు అయ్యాయి.
ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ 2022 (T20 World Cup 2022) జరగనుంది. మొత్తం 12 జట్లతో దాదాపు నెలరోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య ఐసీసీ 2022 టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. అయితే, కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2021లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా టోర్నీ కోసం వేదికలు ఖరారు అయ్యాయి. మొత్తం 7 వేదికలలో ఈ ప్రపంచకప్ జరగనుంది. ఆ ఏడు వేదికలుగా మెల్బోర్న్, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ ఖరారు అయ్యాయి. ఈ వరల్డ్‌కప్‌నకు సంబంధించి కీలక వివరాలను ఈ నెల 21వ తేదీన వెల్లడించనున్నట్లు ఐసీసీ (ICC) తెలిపింది. 21న మ్యాచ్‌ల షెడ్యూల్ తో పాటు ఏ జట్టు ఏ గ్రూపులో ఉండనుంది వంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఈ మెగాటోర్నీలోని పలు మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల అమ్మకం కూడా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎనిమిదో ఐసీసీ టీ20 ప్రపంచకప్. మొత్తం ఈ టోర్నీలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 45 మ్యాచ్‌లు 7 వేదికలలో జరగనున్నాయి. సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో నవంబర్ 9, 10వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ఇక నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను బట్టి మొత్తం 8 జట్లు ఇప్పటికే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాయి. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన వాటిలో ఉన్నాయి. ఇక మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
గత ప్రపంచకప్‌లో సూపర్ 12లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ సారి కూడా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు గ్రూప్‌లుగా విభజించి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.యూఏఈ వేదికగా 2021 సెకండాఫ్‌లో జరిగిన గత టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్, పాకిస్థాన్ సెమీ ఫైనల్ వరకు చేరుకున్నాయి. కాగా ఈ ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్ 12లోనే ఇంటి దారి పట్టి తీవ్రంగా నిరశపరిచింది. ఇక, 2022 మెగా టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.