హోమ్ /వార్తలు /క్రీడలు /

Hardik Pandya: అయ్యో, హార్దిక్ కి ఎంత కష్టమొచ్చింది.. తీవ్రబాధలో టీమిండియా స్టార్ ప్లేయర్!

Hardik Pandya: అయ్యో, హార్దిక్ కి ఎంత కష్టమొచ్చింది.. తీవ్రబాధలో టీమిండియా స్టార్ ప్లేయర్!

Hardik Pandya: అయ్యో, హార్దిక్ కి ఎంత కష్టమొచ్చింది.. తీవ్రబాధలో టీమిండియా స్టార్ ప్లేయర్!

Hardik Pandya: అయ్యో, హార్దిక్ కి ఎంత కష్టమొచ్చింది.. తీవ్రబాధలో టీమిండియా స్టార్ ప్లేయర్!

Hardik Pandya: ప్రస్తుతం టీమిండియాతో కలిసి పాండ్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా 20 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)లో టీమిండియా (Team India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జోరు కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో చెలరేగి జట్టుకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. కొంతకాలం క్రితం గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన పాండ్యా.. విశ్రాంతి తీసుకొని పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ (IPL)లో కెప్టెన్‌గా కూడా ప్రతిభ కనబరిచి తన జట్టుకు ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. అంతేకాదు, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించి, జట్టును గెలిపించాడు కూడా. ఇక, రానున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2022) లో టీమిండియా జట్టుకు కీలకం కానున్నాడు. ఇక, ఈ స్టార్ ప్లేయర్ ఇవాళ (అక్టోబర్ 11న) 29 వ పడిలోకి అడుగుపెట్టాడు.

తన పుట్టిన రోజు సందర్భంగా హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వైరలవుతుంది. ఈ ట్వీట్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ బరోడా బాంబర్. అందుకు కారణం తన కొడుకు అగస్త్యను మిస్‌ అవడమేనట. బర్త్‌డే వేడుకలు ఫ్యామిలీ సమక్షంలో జరగనందుకు కాస్త బాధ ఉందని.. అయితే దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టేస్తానని పేర్కొన్నాడు.

అయితే, ట్విటర్‌ వేదికగా తన కొడుకు అగస్త్యతో ఉన్న అనుబంధాన్ని హార్దిక్‌ వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నాడు. ''నా పుట్టినరోజున అగస్త్యను చాలా మిస్సవుతున్నా.. వాడు నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాపం, హార్దిక్ పాండ్యాకు ఎంత కష్టమొచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం టీమిండియాతో కలిసి పాండ్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా 20 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా ఆశలన్నీ హార్దిక్ పాండ్యా మీదే ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాండ్యా..టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. జట్టులో ఐదో బౌలర్‌ రోల్‌తో పాటు చివర్లో దినేష్‌కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే బాధ్యత హార్దిక్‌ పాండ్యాపైన ఉంది. మరి, పాండ్యా ఎలా సత్తా చాటుతాడో వేచి చూడాలి.

First published:

Tags: Cricket, Hardik Pandya, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు