SL vs NAM : ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ఘనంగా ఆరంభం అయ్యింది. మహాసంగ్రామం తొలి మ్యాచ్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనుంది. ఆసియా చాంపియన్ (Asia cup) 2022 శ్రీలంక (Sri Lanka) జట్టుతో నమీబియా (Namibia) తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆసియా కప్ నుంచి కూడా శ్రీలంక సూపర్ ఫామ్ లో ఉంది. తమ చివరి ఐదు మ్యాచ్ ల్లోనూ శ్రీలంక విజయం సాధించడం విశేషం. ఈ క్రమంలో శ్రీలంక అండర్ డాగ్స్ గా ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం సూపర్ 12పై కన్నేసింది. మరో వైపు నమీబియాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వివిధ టి20 లీగ్ ల్లో ఆడిన ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. టి20 ఫార్మాట్ కాబట్టి సంచలనాలు నమోదు అయ్యేందుకు ఆస్కారం ఉంది.
ఇది కూడా చదవండి : మహాసంగ్రామానికి టీమిండియా రెడీ.. రోహిత్ సేన షెడ్యూల్, పూర్తి బలగం ఇదే..
ఫార్మాట్ పద్ధతి ఇదే
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫార్మాట్ లోనే ఈ ఏడాది కూడా జరగనుంది. గతేడాది నవంబర్ లోపూ టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 8లో నిలిచిన జట్లు నేరుగా సూపర్ 12కు అర్హత సాధించాయి. ఇక తర్వాతి ర్యాంక్ జట్లలో శ్రీలంక, వెస్టిండీస్ లు నేరుగా గ్రూప్ దశకు చేరుకున్నాయి. ఐర్లాండ్, జింబాబ్వే, యూఏఈ, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల్లో విజయాలు సాధించి టి20 ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. అక్టోబర్ 16 నుంచి 22 వరకు 8 జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ లు జరగనున్నాయి. నాలుగు జట్ల చొప్పున 8 జట్లును రెంగు గ్రూపులుగా విభజించారు.
Sri Lanka fans unsurprisingly outnumbering Namibia fans by a large number in Geelong ahead of the opening match of the #T20WorldCup pic.twitter.com/lvUuwY93ak
— Alex Malcolm (@Alex_Malcolm) October 16, 2022
గ్రూప్ ‘ఎ‘లో శ్రీలంక, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. వీటి మధ్య లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్ లు ముగిశాక ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధించనున్నాయి.
తుది జట్లు ఇవే
నమీబియా
లా కాక్, లింగెన్, బార్డ్, ఈటన్, ఎరాస్మస్, ఫ్రైలింక్, స్మిత్, వీస్, గ్రీన్, స్కోల్ట్జ్, షికొంగో
శ్రీలంక
నిస్సంక, కుశాల్ మెండీస్, ధనంజయ డి సిల్వా, దన్షిక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షాన్, మహీశ్ తీక్షణ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Australia, Sri Lanka, T20 World Cup 2022