SL vs NAM : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో తొలి మ్యాచ్ లోనే సంచలనం నమోదయ్యేలా ఉంది. గ్రూప్ ‘ఎ‘లో భాగంగా శ్రీలంక (Sri Lanka), నమీబియా (Namibia) జట్ల మధ్య టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నమీబియా శ్రీలంక ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసింది. 20 ఓవర్లలో నమీబియా 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రై లింగ్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జె జె స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు తీశాడు. చమిక కరుణరత్నే, తీక్షణ, దుష్మంత చమీర, హసరంగా తలా ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నమీబియాకు ఆరంభంలో శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు లింజెన్ (3), లా కాక్ (9)లను వెంట వెంటనే అవుట్ చేశారు. అయితే జాన్ నికోల్ (20), స్టీఫెన్ బార్డ్ (26)లతో పాటు కెప్టెన్ ఎరాస్మస్ (20)లు కాసేపు ఆడటంతో తొలి 10 ఓవర్లు ముగిసే సరికి నమీబియా 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. అయితే బ్రేక్ అనంతరం నమీబియా ఆట గాడి తప్పింది. వెంట వెంటనే వికెట్లు పడ్డాయి. భారీ హిట్టర్ డేవిడ్ వీస్ (0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దాంతో నమీబియా 100 కూడా చేరడం కష్టంలా కనిపించింది. అయితే ఫ్రై లింగ్, స్మిత్ నమీబియాను ఆదుకున్నారు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వీరు ఆ తర్వాత రెచ్చిపోయారు. 15 ఓవర్లకు నమీబియా స్కోరు 6 వికెట్లకు 95 పరుగులుగా ఉంది. అయితే చివరి 5 ఓవర్లలో లింగ్, స్మిత్ ఏకంగా 68 పరుగులు సాధించడం విశేషం. చివరి ఐదు ఓవర్లలో వీరిద్దరూ శ్రీలంక బౌలింగ్ ను ఉతికి ఆరేశారు. స్మిత్ భారీ సిక్సర్లతో చెలరేగితే లింగ్ క్లాసిక్ షాట్లతో ఫోర్లు రాబట్టాడు. ఇక చివర్లో శ్రీలంక ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది.
Namibia finish strongly to post a total of 163/7 ???? Will Sri Lanka chase it down?#T20WorldCup | #SLvNAM | ???? https://t.co/vuNGEcX62U pic.twitter.com/2DhZQbgYni
— ICC (@ICC) October 16, 2022
తుది జట్లు ఇవే
నమీబియా
లా కాక్, లింగెన్, బార్డ్, ఈటన్, ఎరాస్మస్, ఫ్రైలింక్, స్మిత్, వీస్, గ్రీన్, స్కోల్ట్జ్, షికొంగో
శ్రీలంక
నిస్సంక, కుశాల్ మెండీస్, ధనంజయ డి సిల్వా, దన్షిక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షాన్, మహీశ్ తీక్షణ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Sri Lanka, T20 World Cup 2022, Team India