UAE vs NED : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 తొలి రోజు డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ఆసియా కప్ (Asia Cup) 2022 చాంపియన్ శ్రీలంక (Sri Lanka)కు నమీబియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక రెండో పోరు కూడా అదే గ్రౌండ్ లో జరగనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ (Netherlands)తో యూఏఈ (UAE) తలపడనుంది. టాస్ నెగ్గిన యూఏఈ ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక రెండోసారి బ్యాటింగ్ చేసి ఓడటంతో.. ఈ పిచ్ పై బ్యాటింగ్ తొలుత చేయడమే మంచిదనే అభిప్రాయనికి యూఏఈ కెప్టెన్ వచ్చాడు. ఇక ఈ పోరులో గెలిచిన జట్టుకు సూపర్ 12 చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.
ఇక యూఏఈ తరఫున ఈ మ్యాచ్ ద్వారా 16 ఏళ్ల అయాన్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. అతడికి నెదర్లాండ్స్ తో జరిగే ఈ మ్యాచ్ లో యూఏఈ తుది జట్టులో చోటు కల్పించింది. దాంతో టి20 ప్రపంచకప్ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా అయాన్ ఖాన్ నిలిచాడు.
ఫార్మాట్ పద్ధతి ఇదే
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫార్మాట్ లోనే ఈ ఏడాది కూడా జరగనుంది. గతేడాది నవంబర్ లోపూ టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 8లో నిలిచిన జట్లు నేరుగా సూపర్ 12కు అర్హత సాధించాయి. ఇక తర్వాతి ర్యాంక్ జట్లలో శ్రీలంక, వెస్టిండీస్ లు నేరుగా గ్రూప్ దశకు చేరుకున్నాయి. ఐర్లాండ్, జింబాబ్వే, యూఏఈ, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల్లో విజయాలు సాధించి టి20 ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. అక్టోబర్ 16 నుంచి 22 వరకు 8 జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ లు జరగనున్నాయి. నాలుగు జట్ల చొప్పున 8 జట్లును రెంగు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ‘ఎ‘లో శ్రీలంక, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. వీటి మధ్య లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్ లు ముగిశాక ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధించనున్నాయి.
తుది జట్లు ఇవే
యూఏఈ
మొహమ్మద్ వసీం, చిరాగ్ సూరి, అర్వింద్, రిజ్వాన్, హమీద్, ఫారిద్, అయాన్ ఖాన్, ఖషీఫ్ దావూద్, కార్తిక్ మియప్పన్, జునైద్ సిద్దిఖ్, జహూర్ ఖాన్
నెదర్లాండ్స్
మ్యాక్స్, విక్రమ్ సింగ్, బాస్ డి లీడె, టామ్ కూపర్, కోలిన్, స్కాట్ ఎడ్వర్డ్స్, మెర్వె, టిమ్ ప్రింగెల్, వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Netherlands, T20 World Cup 2022, UAE