NED vs UAE : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 తొలి రోజు ఆటలో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నెదర్లాండ్స్ (Netherlands)తో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ (UAE) బ్యాటర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ మొత్తం కూడా నెదర్లాండ్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. దాంతో పరుగుల కోసం యూఏఈ తీవ్రంగా శ్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 3 వికెట్లు తీశాడు. ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లు తీశాడు. టిమ్ ప్రింగెల్, వాన్ డెర్ మెర్వె లకు చెరో ఒక వికెట్ దక్కింది. యూఏఈ బ్యాటర్లలో మొహమ్మద్ వసీం (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అర్వింద్ (18), కషీఫ్ దావుద్ (15) పరుగులు చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఓపెనర్లుగా వచ్చిన సూరి (12)తో కలిసి వసీం తొలి వికెట్ కు 33 పరుగులు జోడించాడు. ఆ తర్వాత దావుద్ కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వీరు చాలా నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు బోర్డు వేగంగా సాగలేదు. నిజాయితీగా చెప్పాలంటే యూఏఈ టెస్టు ఆటతీరును ప్రదర్శించింది. బౌండరీలు పెద్దగా ఉండటం.. అవుట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉండటంతో బౌండరీలను రాబట్టడంలో యూఏఈ విఫలం అయ్యింది.
20 పరుగులు 6 వికెట్లు
ఒక దశలో యూఏఈ 91 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఫర్వాలేదనిపించింది. అయితే చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో చివరి నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే జోడించిన యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది.
Netherlands do well to restrict UAE to 111/8 in their 20 overs ????#UAEvNED | ???? https://t.co/sD75sGYNF1 pic.twitter.com/NiQsgOcbuG
— ICC (@ICC) October 16, 2022
తుది జట్లు
యూఏఈ
మొహమ్మద్ వసీం, చిరాగ్ సూరి, అర్వింద్, రిజ్వాన్, హమీద్, ఫారిద్, అయాన్ ఖాన్, ఖషీఫ్ దావూద్, కార్తిక్ మియప్పన్, జునైద్ సిద్దిఖ్, జహూర్ ఖాన్
నెదర్లాండ్స్
మ్యాక్స్, విక్రమ్ సింగ్, బాస్ డి లీడె, టామ్ కూపర్, కోలిన్, స్కాట్ ఎడ్వర్డ్స్, మెర్వె, టిమ్ ప్రింగెల్, వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Netherlands, T20 World Cup 2022, UAE