హోమ్ /వార్తలు /క్రీడలు /

NED vs UAE : పైసా వసూల్.. గెలుపు కోసం చివరి వరకు శ్రమించిన పసికూన.. అయితే

NED vs UAE : పైసా వసూల్.. గెలుపు కోసం చివరి వరకు శ్రమించిన పసికూన.. అయితే

PC : ICC

PC : ICC

NED vs UAE : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో 2022లో తొలి రోజే బ్లాక్ బాస్టర్ అయ్యింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ లు కూడా క్రికెట్ అభిమానులను అలరించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

NED vs UAE : టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో 2022లో తొలి రోజే బ్లాక్ బాస్టర్ అయ్యింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ లు కూడా క్రికెట్ అభిమానులను అలరించాయి. తొలి మ్యాచ్ లో ఆసియా కప్ (Asia cup) చాంపియన్ శ్రీలంక (Sri Lanka)ను నమీబియా (Namibia) మట్టి కరిపిస్తే.. ఇక పసికూనలు నెదర్లాండ్స్ (Netherlands), యూఏఈ (UAE) మధ్య నరాలు తెగేలా ఉత్కంఠగా రెండో మ్యాచ్ సాగింది. అయితే ఓపిగ్గా చివరి వరకు ఆడిన నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో యూఏఈపై నెగ్గింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ను యూఏఈ బౌలర్లు కట్టడి చేశారు. అయితే చివరి వరకు క్రీజులో నిలిచిన నెదర్లాండ్స్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ (19 బంతుల్లో 16 నాటౌట్) విన్నింగ్ రన్ తో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా.. తొలి ఐదు బంతుల్లోనే ఆ పరుగులను సాధించి నెదర్లాండ్స్ టోర్నీలో బోణీ కొట్టింది.

మ్యాక్స్ ఓ డౌడ్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టిమ్ ప్రింగిల్ (16 బంతుల్లో 15) చివర్లో ఎడ్వర్డ్స్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో విజయంతో నెదర్లాండ్స్ గ్రూప్ ‘ఎ’ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. టాప్ ప్లేస్ లో నమీబియా ఉంది. ఇక మూడో స్థానంలో యూఏఈ.. నాలుగో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి. టాప్ 2లో నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 3 వికెట్లు తీశాడు. ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లు తీశాడు. టిమ్ ప్రింగెల్, వాన్ డెర్ మెర్వె లకు చెరో ఒక వికెట్ దక్కింది. యూఏఈ బ్యాటర్లలో మొహమ్మద్ వసీం (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అర్వింద్ (18), కషీఫ్ దావుద్ (15) పరుగులు చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఓపెనర్లుగా వచ్చిన సూరి (12)తో కలిసి వసీం తొలి వికెట్ కు 33 పరుగులు జోడించాడు. ఆ తర్వాత దావుద్ కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వీరు చాలా నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు బోర్డు వేగంగా సాగలేదు. నిజాయితీగా చెప్పాలంటే యూఏఈ టెస్టు ఆటతీరును ప్రదర్శించింది. బౌండరీలు పెద్దగా ఉండటం.. అవుట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉండటంతో బౌండరీలను రాబట్టడంలో యూఏఈ విఫలం అయ్యింది.

20 పరుగులు 6 వికెట్లు

ఒక దశలో యూఏఈ 91 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఫర్వాలేదనిపించింది. అయితే చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో చివరి నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే జోడించిన యూఏఈ 6 వికెట్లను కోల్పోయిం

First published:

Tags: Australia, Netherlands, T20 World Cup 2022, UAE

ఉత్తమ కథలు