హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs SL : చావో రేవో మ్యాచ్ లో టాస్ ఓడిన ఇంగ్లండ్.. ఒక మార్పుతో శ్రీలంక.. తుది జట్లు ఇవే

ENG vs SL : చావో రేవో మ్యాచ్ లో టాస్ ఓడిన ఇంగ్లండ్.. ఒక మార్పుతో శ్రీలంక.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

ENG vs SL : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో సూపర్ 12 దశ క్లైమ్యాక్స్ కు చేరుకుంది. గ్రూప్ ‘1’ నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదో ఈ రోజు తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు చేరుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ENG vs SL : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో సూపర్ 12 దశ క్లైమ్యాక్స్ కు చేరుకుంది. గ్రూప్ ‘1’ నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదో ఈ రోజు తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్ తో పాటు సెమీస్ చేరే ఆ రెండో జట్టు ఏదో మరికొన్ని గంట్లలో తేలనుంది. గ్రూప్ ‘1’లో భాగంగా సిడ్నీ వేదికగా మరికొద్ది సేపట్లో శ్రీలంక (Sri Lanka)తో ఇంగ్లండ్ (England) తలపడనుంది. సెమీఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ కీలక పోరులో ఇంగ్లండ్ టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఒక మార్పు చేసింది. మధుషాన్ స్థానంలో కరుణత్నేను జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది.

ఇక ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా శ్రీలంకకు ఒరిగేదేమి లేదు. శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. అయితే వెళుతూ వెళుతూ తమతో ఇంగ్లండ్ ను కూడా తీసుకువెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ అవకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడితే ఈ  గ్రూప్ నుంచి కివీస్ తో పాటు ఆసీస్ సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ప్రయాణం ఇక్కడితే ముగుస్తుంది. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు ఈ టి20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన 89 పరుగుల భారీ ఓటమి ఆ జట్టు పాలిట విలన్ గా మారింది. ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక కంటే కూడా ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. అయితే మ్యాచ్ సిడ్నీలో జరుగుతుండటం.. అదే సమయంలో శ్రీలంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం ఇంగ్లండ్ ను కలవరపెడుతున్నాయి. సిడ్నీ స్వతహాగా స్పిన్ కు అనుకూలిస్తుంది. ఈ క్రమంలో లంక స్నిన్నర్లు హసరంగ, తీక్షణలు ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు.

తుది జట్లు

శ్రీలంక

నిస్సంక, కుశాల్ మెండీస్, ధనంజయ డిసిల్వా, అసలంక, రాజపక్సె, దాసున్ షనక (కెప్టెన్), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, లహిరు కుమార,  రజిత

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, స్టోక్స్, మలాన్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, బ్రూక్స్, స్యామ్ కరణ్, వోక్స్, వుడ్, ఆదిల్ రషీద్,

First published:

Tags: Australia, England, Sri Lanka, T20 World Cup 2022

ఉత్తమ కథలు