హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC : మరోసారి ఐసీసీ పీఠం అతడిదే.. పాపం గంగూలీ..

ICC : మరోసారి ఐసీసీ పీఠం అతడిదే.. పాపం గంగూలీ..

ఐసీసీ లోగో (ఫైల్ ఫోటో)

ఐసీసీ లోగో (ఫైల్ ఫోటో)

ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్ గా న్యూజిలాండ్ (New Zealand)కు చెందిన గ్రెగ్ బార్క్ లే (Greg Barclay) మరోసారి ఎన్నికయ్యాడు. మెల్ బోర్న్ (Melbourne)లో శనివారం జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్ గా న్యూజిలాండ్ (New Zealand)కు చెందిన గ్రెగ్ బార్క్ లే (Greg Barclay) మరోసారి ఎన్నికయ్యాడు. మెల్ బోర్న్ (Melbourne)లో శనివారం జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ పదవి కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు చైర్మన్ తవెంగ్వా ముకుహ్లాని (Tavengwa Mukuhlani) మొదట పోటీ పడ్డారు. అయితే ఆఖర్లో ఆయన ఐసీసీ చైర్మన్ రేసు నుంచి తప్పుకున్నారు. దాంతో గ్రెగ్ బార్క్ లే ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఆయన ఈ పదవిని చేపట్టడం వరుసగా రెండోసారి. ఈ పదవిలో గ్రెగ్ బార్క్ లే రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. గ్రెగ్ బార్క్ లే 2020 నవంబర్ లో తొలిసారిగా ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు.

వాడీ వేడీగా

వాస్తవానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈసారి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికవుతాడని అంతా అనుకున్నారు. అయితే గత నెలలో గంగూలీ అనూహ్యంగా బీసీసీఐ పదవిని కోల్పోవడం.. ఆ తర్వాత జై షాకు గంగూలీకి గ్యాప్ పెరగడం జరిగింది. అంతేకాకుండా గంగూలీ ఐసీసీ పదవి రేసులో లేడని కూడా ప్రకటించారు. ఫలితంగా గ్రెగ్ బార్క్ లే మరోసారి చైర్మన్ అవ్వడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఐసీసీలో మొత్తం 17 క్రికెట్ బోర్డులకు సభ్యత్వం ఉంది. గ్రెగ్ బార్క్ లే ఏకగ్రీవం అనుకున్న తరుణంలో ఊహించని విధంగా తవెంగ్వా ముకుహ్లాని చైర్మన్ రేసులోకి వచ్చాడు. ధనిక బోర్డు బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు బార్క్ లేకు మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే బోర్డులు తవెంగ్వాకు మద్దతుగా నిలిచాయి. ఇక న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ బోర్డులు తటస్థంగా నిలిచాయి. అయితే చివరకు ధనిక బోర్డులైన బీసీసీఐ, ఈసీబీ, సీఏల మాటే నెగ్గింది. దాంతో చివరి నిమిషంలో తవెంగ్వా ఐసీసీ చైర్మన్ రేసు నుంచి తప్పుకున్నాడు.

ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత తవెంగ్వా స్పందించారు.  ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్ లే రెండోసారి నియామకం అవ్వడం తనకు సంతోషాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. బార్క్ లే మరోసారి ఐసీసీ చైర్మన్ గా ఉంటే క్రికెట్ కు మేలు జరుగుతుందని తవెంగ్వా పేర్కొన్నారు. రోజు రోజుకు క్రికెట్ ఆడే దేశాల సంఖ్య పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు క్రికెట్ ఆడతాయని అన్నాడు. తన ఎన్నికపై బార్క్ లే మాట్లాడుతూ.. తనను రెండోసారి ఎన్నుకున్నందుకు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ళలో క్రికెట్‌కు కొత్త దేశాలకు విస్తరింపజేయడంలో విజయం సాధించామని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. క్రికెట్ ను మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

First published:

Tags: Bcci, ICC, New Zealand, Sourav Ganguly

ఉత్తమ కథలు