హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs PAK Final : ఇంగ్లండ్ బౌలర్ల జోరు.. పాకిస్తాన్ బేజారు.. బట్లర్ సేన టార్గెట్ ఎంతంటే..

ENG vs PAK Final : ఇంగ్లండ్ బౌలర్ల జోరు.. పాకిస్తాన్ బేజారు.. బట్లర్ సేన టార్గెట్ ఎంతంటే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

ENG vs PAK Final : అంతిమ సమరంలో పాకిస్తాన్ బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్ల జోరుతో కేవలం సాధారణ స్కోరుకు మాత్రమే పరిమితమయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

క్లైమాక్స్ ఫైట్ లో పాకిస్తాన్ (Pakistan) తడబడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దీంతో.. ఇంగ్లండ్ ముందు సాధారణ లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. పాకిస్తాన్ బ్యాటర్లలో షాన్ మసూద్ (28 బంతుల్లో 38 పరుగులు ; 2 ఫోర్లు, 1 సిక్సర్), బాబర్ ఆజాం (28 బంతుల్లో 32 పరుగులు ; 2 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (14 బంతుల్లో 20 పరుగులు ; 2 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ పరిస్థితులకు తగ్గటుగా ఆడారు. ఫస్ట్ వికెట్ కు 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న రిజ్వాన్ ను సామ్ కర్రన్ బోల్తా కొట్టించాడు. 15 పరుగులు చేసిన రిజ్వాన్.. సామ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హారిస్ ప్రభావం చూపలేకపోయాడు. 12 బంతుల్లో 8 పరుగులు చేసిన హారిస్ ను అదిల్ రషీద్ పెవిలియన్ కు పంపాడు. దీంతో.. 45 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాక్ జట్టు.

అయితే, ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్.. కెప్టెన్ బాబర్ ఆజాంతో కలిసి స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అదిల్ రషీద్ విడదీశాడు. 32 పరుగులు చేసిన ఆజాం రషీద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో.. 84 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

అయితే, ఆ వెంటనే బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఇఫ్తికర్ అహ్మద్ డకౌటయ్యాడు. అయితే, ఆ తర్వాత మసూద్, షాదాబ్ ఖాన్ పరుగుల వేగం పెంచారు. కాసేపు దూకుడుగా ఆడారు. అయితే ఈ దూకుడుకు సామ్ కర్రన్ బ్రేకులు వేశాడు. 38 పరుగులు చేసిన మసూద్ కర్రన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక, అక్కట్నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.

తుది జట్లు

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, బ్రూక్స్, ఫిలిప్ సాల్ట్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, హరీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, నవాజ్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీం షా, రవూఫ్

First published:

Tags: Babar Azam, Cricket, England, Pakistan, T20 World Cup 2022

ఉత్తమ కథలు