హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs PAK Final : క్లైమ్యాక్స్ ఫైట్ కు సర్వం సిద్ధం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బట్లర్ నిర్ణయం ఇదే..

ENG vs PAK Final : క్లైమ్యాక్స్ ఫైట్ కు సర్వం సిద్ధం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బట్లర్ నిర్ణయం ఇదే..

PC : TWITTER

PC : TWITTER

ENG vs PAK Final : న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్.. భారత్ (India)తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లలో ప్రపంచకప్ నెగ్గిన జట్టు వెస్టిండీస్ సరసన చేరుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తూ వస్తోన్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఆఖరి పోరాటానికి సమయం ఆసన్నమైంది. మెల్ బోర్న్ (Melbourne)లోని విఖ్యాత ఎంసీజీ (MCG) గ్రౌండ్ లో కాసేపట్లో క్లైమాక్స్ ఫైట్ లో పాకిస్తాన్ (Pakistan)తో ఇంగ్లండ్ (England) అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్ జట్టు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్.. భారత్ (India)తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లలో ప్రపంచకప్ నెగ్గిన జట్టు వెస్టిండీస్ సరసన చేరుతుంది. టి20 ఫార్మాట్ లో విండీస్ మాత్రం రెండు పర్యాయాలు ( 2012, 2016లలో) ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ (2009లో).. ఇంగ్లండ్ (2010లో) జట్లు ఒక్కోసారి మాత్రమే టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచాయి.

ఈ టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టుది విచిత్రమైన కథ. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ ఆఖరి బంతికి ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది. దాంతో పాకిస్తాన్ పై సొంత అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. అయితే అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న పాకిస్తాన్ వరుసగా మూడు విజయాలు సాధించింది. అదే సమయంలో నెదర్లాండ్స్ రూపంలో లక్ కలిసి రావడంతో సెమీస్ గడప తొక్కింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై నెగ్గిన పాక్ మూడోసారి ఫైనల్లో ప్రవేశించింది. పాక్ జట్టులో బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ కీలకమైన ప్లేయర్స్.

ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే.. టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. అయితే ఐర్లాండ్ చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ ల్లో నెగ్గి (ఆస్ట్రేలియా మ్యాచ్ మినహా.. ఆ మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది) సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో భారత్ పై 10 వికెట్ల తేడాతో నెగ్గి సగర్వంగా ఫైనల్ చేరింది. ఇంగ్లీష్ జట్టులో జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్, అదిల్ రషీద్, సామ్ కర్రన్ డేంజరస్ ప్లేయర్స్. వీరి రాణిస్తే పాకిస్తాన్ కు తిప్పలు తప్పవు.

ఇరు జట్లలోనూ ఓపెనర్లే కీలకంగా ఉన్నారు. సెమీస్ ముందు వరకు కూడా ఏ మాత్రం ప్రభావం చూపని పాక్ ఓపెనర్లు సెమీఫైనల్స్ లో మాత్రం అదరగొట్టారు. సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చిన బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ లు అర్ధ్ సెంచరీలతో పాకిస్తాన్ ను గెలిపించారు. మరోసారి వీరు ఫైనల్లో కూడా రాణిస్తే ఇంగ్లండ్ కు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో కూడా పాకిస్తాన్ బలంగా ఉంది. షాహీన్ అఫ్రిది తిరిగి లయ అందుకోవడం.. నసీం షా నిలకడగా రాణిస్తుండటం జట్టుకు కలిసి వచ్చే అంశాలు.

ఇక ఆల్ రౌండర్లు నవాజ్, షాదాబ్ ఖాన్ లతో పాటు యువ సంచలనం హరీస్ అహ్మద్ భారీ షాట్లు ఆడితే ఇంగ్లండ్ కు తిప్పలు ఖాయం. ఇంగ్లండ్ కు కూడా ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్ కీలకం కానున్నారు. భారత్ పై జరిగిన సెమీస్ లో వీరు అజేయంగా జట్టును గెలిపించారు. వీరితో పాటు స్టోక్స్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీలు కూడా కీలకం కానున్నారు. ఇక సెమీస్ కు దూరమైన వుడ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

తుది జట్లు

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, బ్రూక్స్, ఫిలిప్ సాల్ట్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, హరీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, నవాజ్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీం షా, రవూఫ్

First published:

Tags: Babar Azam, Cricket, England, Pakistan, T20 World Cup 2022

ఉత్తమ కథలు