T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 సూపర్ 12కు సూపర్ ఫినిష్ లభించనుంది. నవంబర్ 6 (ఆదివారం)న ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్ లే గ్రూప్ ‘2’ నుంచి సెమీఫైనల్ కు వెళ్లే జట్లను డిసైడ్ చేయనున్నాయి. తొలుత దక్షిణాఫ్రికా (South Africa)తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ (Pakistan)తో బంగ్లాదేశ్ (Bangladesh) తాడో పేడో తేల్చుకోనుంది. ఇక చివరగా జింబాబ్వే (Zimbabwe)తో భారత్ (India) సై అంటోంది. ప్రస్తుతానికి అయితే దక్షిణాఫ్రికా, భారత్ లు సెమీఫైనల్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో చివరి వరకు ఎవరు నెగ్గుతారో చెప్పలేని పరిస్థితి. దాంతో ఆదివారం ముగిస్తేనే ఎవరు సెమీస్ కు చేరుకుంటారో తేలనుంది.
దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇస్తుందా?
ప్రస్తుతం దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో సౌతాఫ్రికా నెగ్గితే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం సెమీఫైనల్ ఆశలు దూరం కానున్నాయి. ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం ఉదయం గం. 5.30 లకు ఆరంభం కానుంది.
బంగ్లాదేశ్ తో పాక్ అమీతుమీ
అడిలైడ్ ఓవల్ వేదికగాగా పాక్, బంగ్లా మ్యాచ్ కూడా జరగనుంది. సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ ముగియగానే ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా నెగ్గితే మాత్రం బంగ్లాదేశ్ ఆశలు దాదాపుగా ఆవిరి అవుతాయి. అందుకు కారణం నెట్ రన్ రేట్. బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ చాలా పేలవంగా ఉంది. సౌతాఫ్రికా ఓడితేనే బంగ్లాదేశ్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక పాకిస్తాన్ కు మాత్రం సెమీస్ చేరాలంటే బంగ్లాపై నెగ్గి.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో భారత్ ఓడాలని కోరుకోవాలి. అలా కాకుండా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడి.. బంగ్లాపై పాకిస్తాన్ నెగ్గితే అప్పుడు జింబాబ్వేపై గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే గ్రూప్ టాపర్ గా భారత్ నిలవాలంటే మాత్రం జింబాబ్వేపై తప్పక నెగ్గాలి. పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది. ఇక రోజులో చివరి మ్యాచ్ అయిన భారత్, జింబాబ్వే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ఆరంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India vs South Africa, Netherlands, Pakistan, South Africa, T20 World Cup 2022, Team India, Zimbabwe