టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ను, బంగ్లా వివాదాలకు కేంద్రంగా మారుస్తోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఇండియా కేవలం 5 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని జట్టు గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. విరాట్ కోహ్లీ (Virat ఫేక్ త్రో ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనికి భారత్‌కు జరిమానా విధించాల్సి ఉండాలని బంగ్లా జట్టు ఆరోపిస్తోంది. ICC నియమావళి ప్రకారం.. బ్యాట్స్‌మెన్ దృష్టిని ఉద్దేశపూర్వకంగా మరల్చకూడదు. అందుకు ఐదు పరుగులు పెనాల్టీగా ఇస్తారు. ఇదే బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్‌లో జరిగి ఉంటే మ్యాచ్ టైగా ముగిసేది.
* అసలేం జరిగింది?
మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో.. లిట్టన్ దాస్ ఆఫ్ డీప్ ఆఫ్-సైడ్ ఫీల్డ్ వైపు బాల్ ఆడాడు. ఆ బాల్‌ను అర్ష్‌దీప్ సింగ్, బౌలర్ ఎండ్ వైపు త్రో చేశాడు. పాయింట్ వద్ద నిలబడిన కోహ్లి బాల్‌ను అందుకుని వికెట్లవైపు విసురుతున్నట్లు నటించాడు. వాస్తవానికి బాల్ కోహ్లి చేతిలో లేదు. బాల్ కోహ్లీని దాటి బౌలర్ ఎండ్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ఫీల్డ్‌లోని అంపైర్లు మరైస్ ఎరాస్మస్, క్రిస్ బ్రౌన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో ఎండ్‌లో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ వికెట్ కీపర్ మాట్లాడుతూ.. మైదానంలో జరిగిన ఒక పెద్ద సంఘటనను అంపైర్ ఎలా విస్మరిస్తారని ప్రశ్నించాడు. అంపైర్ అప్రమత్తంగా ఉండి ఉంటే తమకు పెనాల్టీ కింద లభించే ఐదు పరుగులతో మ్యాచ్ గెలిచి ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని చెప్పాడు.
Fake fielding. 5 run penalty. Missed by umpires. Of course. https://t.co/KgRBHz9jv3
— Dennis Fake Fielding (@DennisCricket_) November 2, 2022
* రూల్ ఏంటి?
ICC చట్టం 41.5 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా దృష్టి మరల్చడం, మోసం చేయడం లేదా బ్యాటర్‌ను అడ్డుకోవడం వంటివి చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు చేస్తే రూల్స్ అతిక్రమించినట్లు భావిస్తారు. అంపైర్ ఆ నిర్దిష్ట డెలివరీని డెడ్ బాల్‌గా ప్రకటించవచ్చు. బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు పెనాల్టీ కింద ఐదు పరుగులు కేటాయిస్తారు.
ఇది కూడా చదవండి : ఐపీఎల్ 2023కు ముందు పంజాబ్ జట్టులో భారీ మార్పు.. మయాంక్ పై వేటు.. నెక్ట్స్ కెప్టెన్ అతడే..
* మరో రెండు సంఘటనలు
ఇండియా ఇన్నింగ్ ముగిశాక, బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించింది. బంగ్లాదేశ్ 66/0 వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఇద్దరు అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లను సంప్రదించిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. బంగ్లా కెప్టెన్ షకీబ్ ఫీల్డ్‌ని తిరిగి తీసుకోవడంపై అసంతృప్తిగా కనిపించాడు. ఎందుకంటే గ్రౌండ్ చాలా తడిగా ఉందని అతను భావించాడు. పిచ్ ఎలా ఉందో షకీబ్ తనిఖీ చేస్తూ కనిపించాడు. ఈ సమయంలో అతడు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో రావడంతో చర్చ జరిగింది.
ఇండియా ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లీ తీరుపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు హసన్ మహ్మద్ తన ఓవర్లో రెండు బౌన్సర్లను బౌల్ చేసినట్లు కోహ్లీ.. అంపైర్ ఎరాస్మస్ వైపు నో-బాల్‌ను సూచించాడు. అంపైర్ కూడా అంగీకరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అవాక్కయ్యాడు. కోహ్లీ తీరుపై స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs bangladesh, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli