T20 World Cup 2022 : ఆఖరి నిమిషంలో టి20 ప్రపంచకప్ (T20 World Cup) జట్టులో ఆస్ట్రేలియా (Australia) ఒక మార్పు చేసింది. న్యూజిలాండ్ (New Zealand)తో ఈ నెల 22న జరిగే సూపర్ 12 ఆరంభ పోరుకు ముందు ఆసీస్ ఈ మార్పు చేయడం విశేషం. వికెట్ కీపర్ బ్యాటర్ జాష్ ఇంగ్లీస్ (Josh Inglis) గోల్ఫ్ ఆడుతూ చేతికి గాయం చేసుకున్నాడు. దాంతో అతడిని టి20 ప్రపంచకప్ నుంచి తప్పించింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ (Cameron Green)ను టి20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పేర్కొంది. ఈ విషయాన్ని ఐసీసీ (ICC) కూడా స్పష్టం చేసింది. జాష్ ఇంగ్లీస్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆసీస్ బ్యాకప్ వికెట్ కీపర్ లేకుండానే టోర్నీలో ఆడనుంది. వేడ్ మాత్రమే ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో ఉన్న వికెట్ కీపర్. జాష్ ఇంగ్లీస్ ను అతడికి బ్యాకప్ గా తీసుకున్నారు.
ఇది కూడా చదవండి : చిరకాల ప్రత్యర్థితో హై వోల్టేజ్ మ్యాచ్.. ఆ నలుగురికి నో ఛాన్స్!
ఇక ఈ మధ్య కాలంలో గ్రీన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా భారత్ తో జరిగిన టి20 సిరీస్ లో గ్రీన్ పవర్ హిట్టింగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 23 ఏళ్ల గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. గ్రీన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చేరడంతో ఆ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారింది. ముఖ్యంగా జట్టు ఆల్ రౌండర్లతో నిండిపోయింది. గ్రీన్ ను ఓపెనర్ గా ఉపయోగించే అవకాశం ఉంది. వార్నర్ కు తోడుగా గ్రీన్ ను ఓపెనింగ్ కు పంపించే అవకాశం ఉంది. ఫించ్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
???? JUST IN: Australia forced into making a change in their #T20WorldCup squad due to injury.
Full details ????https://t.co/lhPVJT3RmH — ICC (@ICC) October 20, 2022
జట్టు మొత్తం ఆల్ రౌండర్లే
ఆస్ట్రేలియా జట్టు ఆల్ రౌండర్లతో నిండిపోయింది. మ్యాక్స్ వెల్, స్టొయినస్, గ్రీన్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్ ల రూపంలో జట్టులో ఏకంగా 5గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. ఏ జట్టులోనూ ఇంతమంది ఆల్ రౌండర్లు లేరు. వీరికి తోడు వార్నర్, ఫించ్, వేడ్ రూపంలో మంచి బ్యాటర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తుంది. హేజల్ వుడ్, స్టార్క్ తో పేస్ భయంకరంగా కనిపిస్తుంది. జంపా, అగర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అవసరం అయితే మ్యాక్స్ వెల్ కూడా కొన్ని ఓవర్ల పాటు స్పిన్ వేసే సత్తా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెడుతున్న ఆస్ట్రేలియా సొంత ప్రేక్షకుల మధ్య టైటిల్ ను డిఫెండ్ చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టు
ఫించ్ (కెప్టెన్), వార్నర్, అగర్, కమిన్స్, టిమ్ డేవిడ్, గ్రీన్, హేజల్ వుడ్, మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్టొయినస్, వేడ్, జంపా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, Glenn Maxwell, ICC, Pat cummins, Steve smith, T20 World Cup 2022