టీ20 వరల్డ్ కప్ 2022 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా బోణీ కొట్టారు. ఫస్ట్ విక్టరీని నమోదు చేసింది. పెర్త్ వేదికగా జరిగిన టీ20 మ్యాచులో శ్రీలంకను ఓడించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. శ్రీలంక సెట్ చేసిన 158 పరుగుల టార్గెట్ ను మూడు వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో చేస్ చేసింది. దీంతో, ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మరో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మార్స్ స్టొయినిస్ ఇన్నింగ్సే హైలెట్. ఒంటి చేత్తో ఆసీస్ కు సూపర్ విక్టరీ అందించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి.. ఆస్ట్రేలియా తరపున ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. స్టొయినిస్ ( 18 బంతుల్లో 59 పరుగులు ; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మ్యాక్స్ వెల్ ( 12 బంతుల్లో 23 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అయితే, ఆసీస్ కెప్టెన్ (42 బంతుల్లో కేవలం 31 పరుగులు) మాత్రమే చేసి టెస్ట్ ఇన్నింగ్స్ ను తలపించాడు.
158 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా ఓపెనర్లు చాలా నిదానంగా ప్రారంభించారు. అయితే, శ్రీలంక జట్టుకు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో షాక్ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ బౌలర్ బినుర ఫెర్నాండో గాయంతో వెనుదిరిగాడు. అతడు కేవలం ఐదు బంతులు మాత్రమే వేశాడు. ఫెర్నాండో గాయంతో వెనుదిరిగినా.. మిగతా ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆసీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడలేకపోయారు.
ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మహీశ్ తీక్షణ బౌలింగ్ లో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షనకకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 26 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కూడా పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డాడు. అయితే, శ్రీలంక ఫీల్డర్ల వైఫల్యం రెండు సార్లు బతికిపోయిన మార్ష్.. ఫోర్, సిక్సర్ కొట్టి దూకుడుగా కన్పించాడు. అయితే.. ఈ దూకుడుకు ధనంజయ డి సిల్వ బ్రేకులు వేశాడు. 17 పరుగులు చేసిన మార్ష్.. రాజపక్సకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Half-century of 17 balls! That's the fastest by an Aussie man in T20Is #T20WorldCup https://t.co/AWyS6Hz5q3
— cricket.com.au (@cricketcomau) October 25, 2022
దీంతో..60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక, ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ రావడం రావటంతోనే ఎదురు దాడికి దిగాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్సీని కరుణరత్నే పెవిలియన్ బాట పట్టించాడు. అతని బౌలింగ్ లో ఆషేన్ బండారాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాక్స్ వెల్ 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు. దీంతో.. 89 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది.
Australia secure their first win of the #T20WorldCup!
— cricket.com.au (@cricketcomau) October 25, 2022
అయితే, మరో ఎండ్ లో ఉన్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు. ఇక, నాలుగో వికెట్ గా బరిలోకి దిగిన స్టొయినిస్ మాత్రం దూకుడుగా ఆడాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా టార్గెట్ ఈజీగా చేజ్ చేసింది. ఈ మ్యాచులో శ్రీలంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ ఘోరంగా విఫలయ్యాడు. ఏకంగా మూడు ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక, అంతకుముందు.. శ్రీలంక ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (45 బంతుల్లో 40 పరుగులు..) టెస్ట్ టైప్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఇదే శ్రీలంక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు. చరిత్ అసలంక (25 బంతుల్లో 38 పరుగులు.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు నాటౌట్ ), కరుణరత్నే (7 బంతుల్లో 14 పరుగులు ; 2 ఫోర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ధనంజయ డి సిల్వ (23 బంతుల్లో 26 పరుగులు.. 3 ఫోర్లు) ఫర్వాలేదన్పించాడు. కుషాల్ మెండిస్ (5), భానుక రాజపక్స (7), షనక (3), హసరంగ (1) తక్కువ స్కోరుకే మాత్రమే పరిమితమై నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అస్టన్ ఆగర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలా ఓ వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, Glenn Maxwell, Sri Lanka, T20 World Cup 2022