AUS vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. గ్రూప్ ఆఫ్ డెత్ గా ఉన్న గ్రూప్ ‘1’లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా మరికాసేపట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)తో ఐర్లాండ్ (Ireland) తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. కరోనా నుంచి కోలుకున్న ఆడం జంపాను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో గత మ్యాచ్ లో ఆడిన అగర్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక ఐర్లాండ్ మాత్రం ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన టీంతోనే బరిలోకి దిగనుంది. ఇరు జట్లు కూడా చెరో మూడు పాయింట్లతో ఉన్నాయి. సెమీస్ చేరాలంటే ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
నెట్ రన్ రేట్ పెంచుకునేలా
డిఫెండింగ్ చాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా భారీ ఓటమి ఎదురైంది. అనంతరం శ్రీలంకపై నెగ్గినా.. వర్షంతో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్, ఐర్లాండ్ తో ఆస్ట్రేలియా సమానంగా మూడు పాయింట్లతో ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో వెనుకబడి ఉంది. ఆసీస్ తన తదుపరి మ్యాచ్ ల్లో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించడంతో పాటు నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్ ‘1’లో ఏ జట్టు సెమీస్ చేరుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. గ్రూప్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లు ఉన్నాయి. ఒక్క న్యూజిలాండ్ మాతమ్రే ఓటమి లేకుండా కొనసాగుతుంది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ లో ఓడాయి. ఐర్లాండ్ ఇంగ్లండ్ కు షాకిచ్చింది. ఇక వర్షంతో కొన్ని మ్యాచ్ లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటికైతే న్యూజిలాండ్ 5 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా ఉంది. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలు తలా మూడు పాయింట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక శ్రీలంక, అఫ్గానిస్తాన్ లు చెరో రెండు పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్ల ో ఉన్నాయి.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మార్ష్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, వేడ్, జంపా, కమిన్స్, స్టార్క్, హేజల్ వుడ్
ఐర్లాండ్
ఆండ్రీ బాల్ బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, టక్కర్, హెక్టార్, కర్టీస్ క్యాంఫెర్, డాక్ రెల్, మెకార్ధి, హ్యాండ్, జాష్ లిటిల్, డిలానీ, మార్క్ ఎయిడర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, Glenn Maxwell, Pat cummins, Steve smith, T20 World Cup 2022