AUS vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ల తడబాడు కొనసాగుతూనే ఉంది. డిఫెండింగ్ చాంపియన్ గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. గ్రూప్ ‘1’లో భాగంగా ఐర్లాండ్ (Ireland)తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఒక దశలో 200 మార్కును ఈజీగా దాటుతుందని అనిపించినా చివర్లో ఐర్లాండ్ బౌలర్లు కమ్ బ్యాక్ చేయడంతో అనుకున్న స్కోరు కంటే కూడా 20 నుంచి 40 పరుగులు తక్కువగానే ఆస్ట్రేలియా చేసింది. అరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సక్స్) ఫర్వాలేదనపించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ఆస్ట్రేలియా బ్యాటర్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మెకార్థి 3 వికెట్లు, జాష్ లిటిల్ 2 వికెట్లతో రాణించారు.
ఇది కూడా చదవండి : ప్లేట్ మార్చేసిన పాకిస్తాన్.. మొన్న గెలవాలని పూజలు.. ఇప్పుడు ఓడాలని
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను ఐర్లాండ్ బౌలర్లు ఆరంభంలో ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా మెకార్థీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చాడు. వార్నర్ (3), మార్ష్ (28) వికెట్లను తీసి ఐర్లాండ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఫామ్ లో లేని మ్యాక్స్ వెల్ (13) మరోసారి విఫలం అయ్యాడు. అయితే ఫించ్, మార్కస్ స్టొయినిస్ ఆసీస్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు వేగంగా కదిలింది. వీరిద్దరూ 4వ వికెట్ కు వేగంగా 70 పరుగులు జోడించారు. అయితే చివర్లో కమ్ బ్యాక్ చేసిన ఐర్లాండ్ వీరిద్దరినీ వెంట వెంటనే అవుట్ చేశారు. దాంతో ఆస్ట్రేలియా 200 మార్కును అందుకోలేకపోయింది.
A good finish from Tim David and Matthew Wade help Australia set a target of 180 ???? Will Ireland chase it down? T20WorldCup | #AUSvIRE | ????: https://t.co/CW4eQlDZGZ pic.twitter.com/gEbePntvcw
— ICC (@ICC) October 31, 2022
తుది జట్లు
ఆస్ట్రేలియా
ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మార్ష్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, వేడ్, జంపా, కమిన్స్, స్టార్క్, హేజల్ వుడ్
ఐర్లాండ్
ఆండ్రీ బాల్ బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, టక్కర్, హెక్టార్, కర్టీస్ క్యాంఫెర్, డాక్ రెల్, మెకార్ధి, హ్యాండ్, జాష్ లిటిల్, డిలానీ, మార్క్ ఎయిడర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, Glenn Maxwell, Pat cummins, Steve smith, T20 World Cup 2022