AUS vs ENG : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022ని వరుణ దేవుడు శాసిస్తున్నాడు. ముఖ్యంగా మెల్ బోర్న్ (Melbourne) వేదికగా జరిగే మ్యాచ్ లపై వరుణుడు పగబట్టాడు. ఇప్పటికే శుక్రవారం ఎంసీజీ (MCG) వేదికగా జరగాల్సిన అఫ్గానిస్తాన్ (Afghanistan), ఐర్లాండ్ (Ireland) మ్యాచ్ బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇక తాజాగా ఇదే గ్రౌండ్ లో రెండో మ్యాచ్ గా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్లు తలపడాల్సి ఉంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan) జట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. అంతే ప్రాముఖ్యత ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఎంసీజీలో భారీ వర్షం అయితే కురవడం లేదు. చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే అవుట్ ఫీల్డ్ చాలా చిత్తడిగా ఉంది.
ఇది కూడా చదవండి : సంచలనాల ప్రపంచకప్.. కూనలని తక్కువ అంచనా వేస్తే అడ్రస్ గల్లంతే
ఈ క్రమంలో అంపైర్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రౌండ్ ను పరిశీలించనున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి మ్యాచ్ ఎప్పుడు ఆరంభమయ్యేదానిపై స్పష్టత రానుంది. అక్కడ సమయం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత వర్షం కురిసే అవకాశం లేదు. అవుట్ ఫీల్డ్ రెడీ అయితే కనీసం ఇన్నింగ్స్ కు 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధించిన జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం అంతే సంగతులు. ఇప్పటి వరకు ఇరు జట్లు కూడా రెండేసి మ్యాచ్ లు ఆడాయి. రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ లో నెగ్గి మరో మ్యాచ్ లో ఓడింది.
ఇక ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ ఆశలు డేంజర్ లో పడతాయి. ఎందుకంటే ఇంగ్లండ్ తన తర్వాతి రెండు మ్యాచ్ లను బలమైన న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లలో ఒక జట్టులో ఓడినా ఇంగ్లండ్ ప్రపంచకప్ కథ ముగిసినట్లే. ఇక ఆస్ట్రేలియాకు మాత్రం కాస్త బెటర్ ఛాన్స్ లే ఉన్నాయి. ఈ మ్యాచ్ రద్దయినా ఆసీస్ కు సెమీస్ చేరే దారులు ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా తన తదుపరి రెండు మ్యాచ్ లను బలహీన అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లతో ఆడాల్సి ఉంది.
కొంపముంచిన ఐర్లాండ్
ఈ టి20 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరెట్ గా ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగుల తేడాతో ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. అయితే మలాన్ ఆడిన జిడ్డు ఇన్నింగ్స్ కారణంతో పాటు వర్షం కారణంగా ఇంగ్లండ్ ఓడాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Glenn Maxwell, Pat cummins, Steve smith, T20 World Cup 2022