AUS v ENG : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో ఒకే రోజు జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మెల్ బోర్న్ (Melbourne)లోని విఖ్యాత ఎంసీజీ (MCG) స్టేడియంలో శుక్రవారం జరగాల్సిన గ్రూప్ ‘1’ రెండు మ్యాచ్ లు కూడా వాన కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. తొలుత అఫ్గానిస్తాన్ (Afghanistan), ఐర్లాండ్ (Ireland) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవ్వగా.. తాజాగా ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యింది. వర్షం తగ్గినా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంది. దాంతో అంపైర్లు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ ను రద్దు చేసేందుకే మొగ్గు చూపారు. పాయింట్లను ఇరు జట్లకు చెరొక పాయింట్ గా పంచారు.
వర్షం కారణంగా మ్యాచ్ ను మొదట 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వాయిదా వేశారు. అయితే అప్పుడు గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మరోసారి వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.20 గంటలకు మూడోసారి పరిశీలిస్తామని పేర్కొన్నారు. అంతలోపే మరోసారి వర్షం వచ్చింది. దాంతో ఇక ఆట సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన అంపైర్లు ఇరు జట్లు కెప్టెన్ లకు విషయాన్ని తెలియజేసి మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో గెలిచి.. మరో దాంట్లో ఓడింది. ఈ మ్యాచ్ రద్దయ్యింది. దాంతో మూడు పాయింట్లతో ఉన్నాయి.
The highly-anticipated contest between Australia and England has been abandoned due to rain ????#T20WorldCup | #AUSvENG | ????: https://t.co/2Gp7yag0Y7 pic.twitter.com/aInb6SH6hp
— ICC (@ICC) October 28, 2022
ఇంగ్లండ్ కు కష్టమే
ఈ మ్యాచ్ రద్దు అవ్వడంతో ఇంగ్లండ్ సెమీస్ ఆశలు డేంజర్ లో పడ్డాయి. ఎందుకంటే ఇంగ్లండ్ తన తర్వాతి రెండు మ్యాచ్ లను బలమైన న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో ఓడినా ఇంగ్లండ్ ప్రపంచకప్ కథ ముగిసినట్లే. ఇక ఆస్ట్రేలియాకు మాత్రం కాస్త బెటర్ ఛాన్స్ లే ఉన్నాయి. ఆస్ట్రేలియా తన తదుపరి రెండు మ్యాచ్ లను బలహీన అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లతో ఆడాల్సి ఉంది.
కొంపముంచిన ఐర్లాండ్
ఈ టి20 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరెట్ గా ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగుల తేడాతో ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. అయితే మలాన్ ఆడిన జిడ్డు ఇన్నింగ్స్ కారణంతో పాటు వర్షం కారణంగా ఇంగ్లండ్ ఓడాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Glenn Maxwell, Pat cummins, Steve smith, T20 World Cup 2022