AUS vs AFG : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో మరో డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. సూపర్ 12లో భాగంగా గ్రూప్ ‘1’ నుంచి సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia) అఫ్గానిస్తాన్ (Afghanistan)తో తాడో పేడో తేల్చుకోనుంది. కీలక పోరులో ఆస్ట్రేలియా టాస్ ఓడిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా భారీ మార్పులు చేసింది. గాయంతో అరోన్ ఫించ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వేడ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఫించ్ తో పాటు స్టార్క్, టిమ్ డేవిడ్ లను ఆసీస్ పక్కన పెట్టింది. వారి స్థానాల్లో గ్రీన్, రిచర్డ్ సన్, స్మిత్ లకు అవకాశం ఇచ్చింది.
హాట్ ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ చేతిలో ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో ఆసీస్ ఏకంగా 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అనంతరం శ్రీలంక, ఐర్లాండ్ లపై నెగ్గినా నెట్ రన్ రేట్ ను అనుకున్న స్థాయిలో మెరుగు పర్చుకోలేకపోయింది. ఇప్పటికీ ఆసీస్ నెట్ రన్ రేట్ -0.30. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఆసీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గడంతో పాటు నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకోవాలి. నెట్ రన్ రేట్ లో ఇంగ్లండ్ కంటే మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కనీసం 62 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఇంగ్లండ్ పై నెగ్గాల్సి ఉంటుంది.
సెమీస్ దారేది
అఫ్గానిస్తాన్ పై భారీ తేడాతో నెగ్గాలి. నెట్ రన్ రేట్ ను కనీసం +1ను దాటించాలి. అటువంటి సమయంలో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే రెండు దార్లు ఉంటాయి. అందులో మొదటిది శనివారం జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ పై శ్రీలంక నెగ్గాలి. అప్పుడు నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ చేరతాయి. ఒకవేళ ఇంగ్లండ్ నెగ్గితే మాత్రం నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ఇది మెరుగు పడాలంటే ఆస్ట్రేలియా అఫ్గాన్ పై భారీ తేడాతో నెగ్గాలి.
తుది జట్లు
ఆస్ట్రేలియా
గ్రీన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, స్మిత్, మ్యాథ్యూ వేడ్ (కెప్టెన్), కమిన్స్, రిచర్డ్ సన్, హేజల్ వుడ్, జంపా
అఫ్గానిస్తాన్
మొహమ్మద్ నబీ (కెప్టెన్), రహ్మనుల్లా, ఉస్మాన్ గనీ, ఇబ్రహీం జద్రాన్, నైబ్, డార్విష్, నజీబుల్లా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Australia, David Warner, Glenn Maxwell, Pat cummins, Rashid Khan, Steve smith, T20 World Cup 2022