హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS vs AFG : చుక్కలు చూపించిన రషీద్.. ఆఖరికి బతికిపోయిన ఆసీస్.. గెలిచినా సెమీస్ బెర్త్ దక్కలేదు..!

AUS vs AFG : చుక్కలు చూపించిన రషీద్.. ఆఖరికి బతికిపోయిన ఆసీస్.. గెలిచినా సెమీస్ బెర్త్ దక్కలేదు..!

ఆస్ట్రేలియా టీం (ఫైల్ ఫోటో)

ఆస్ట్రేలియా టీం (ఫైల్ ఫోటో)

AUS vs AFG : ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించి.. ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేశాడు. రషీద్ ఖాన్ (23 బంతుల్లో 48 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తప్పక గెలవాల్సిన మ్యాచులో అఫ్గానిస్తాన్ పై విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా జట్టు. అడిలైడ్ వేదికగా హోరాహోరీగా జరిగిన మ్యాచులో అఫ్గాన్ పై కేవలం 4 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. అయితే, మ్యాచు గెలిచినా సెమీస్ వెళ్లడం కష్టంగా మారింది. నెట్ రన్ రేట్ విషయంలో ఇంగ్లండ్ కన్నా వెనుకబడింది ఆసీస్.. ఇక, ఆస్ట్రేలియా సెమీస్ కు చేరాలంటే.. ఇంగ్లండ్ ను శ్రీలంక ఓడించాలి. ఇక, 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నయిబ్ ( 23 బంతుల్లో39 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (17 బంతుల్లో 30 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో రషీద్ ఖాన్ (23 బంతుల్లో 48 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. జంపా, జోష్ హజల్ వుడ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. కేన్ రిచర్డ్ సన్ కి ఒక వికెట్ దక్కింది.

169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఘనీ రెండు పరుగులు చేసి జోష్ హజెల్ వుడ్ బౌలింగ్ లో కమిన్స్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 15 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ కాసేపు మెరుపులు మెరిపించాడు. 17 బంతుల్లో30 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

అయితే, ప్రమాదకరంగా మారుతున్న గుర్బాజ్ ను కేన్ రిచర్డ్ సన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో..40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది అఫ్గాన్.అయితే, గుల్బాదిన్ నయిబ్, ఇబ్రహీం జద్రాన్ తో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా గుల్బాదిన్ మంచి షాట్లతో అలరించాడు. 23 బంతుల్లో 39 పరుగులు చేసి.. అఫ్గాన్ శిబిరంలో ఆశలు రేపాడు.

అయితే, మ్యాక్స్ వెల్ సూపర్ రనౌట్ కు పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 59 పరుగుల విలువైన మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వరుసగా వికెట్లు కోల్పోయింది అఫ్గానిస్తాన్. ఇబ్రహీం జద్రాన్ (26), నజిబుల్లా (0) ను ఒకే ఓవర్ లో ఔట్ చేశాడు ఆడమ్ జంపా. ఆ వెంటనే.. అఫ్గాన్ కెప్టెన్ కూడా ఒక పరుగు మాత్రమే చేసి జోష్ హాజెల్ వుడ్ బౌలింగ్ లో వార్నర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 103 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించి.. ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేశాడు.

అంతకుముందు.. ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది అఫ్గానిస్తాన్. కచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ ( 32 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ ( 30 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. వార్నర్ 25 పరుగులు, స్టొయినిస్ 25 పరుగులతో ఫర్వాలేదన్పించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ఫజల్హక్ ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. ముజీబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

First published:

Tags: Afghanistan, Australia, Cricket, Glenn Maxwell, Rashid Khan, T20 World Cup 2022

ఉత్తమ కథలు