హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS vs AFG : ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసిన అఫ్గాన్.. మ్యాక్సీ మెరుపులతో ఫైటింగ్ టోటల్..

AUS vs AFG : ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసిన అఫ్గాన్.. మ్యాక్సీ మెరుపులతో ఫైటింగ్ టోటల్..

PC : ICC Twitter

PC : ICC Twitter

AUS vs AFG : అడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది అఫ్గానిస్తాన్. కచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది అఫ్గానిస్తాన్. కచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ ( 32 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ ( 30 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. వార్నర్ 25 పరుగులు, స్టొయినిస్ 25 పరుగులతో ఫర్వాలేదన్పించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ఫజల్హక్ ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. ముజీబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచులో భారీ స్కోరు చేయాలనే ఉత్సాహంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు తప్పులు చేశారు. ప్రతి ఒక్కరూ భారీ షాట్లకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే, అఫ్గానిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో వారి పప్పులు ఉడకలేదు. ఈ మ్యాచులో కనీసం 200 పరుగులైనా చేసి.. ఆ తర్వాత తక్కువ స్కోరుకే అఫ్గాన్ ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఆస్ట్రేలియాది.

ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లాలంటే..

హాట్ ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ చేతిలో ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో ఆసీస్ ఏకంగా 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అనంతరం శ్రీలంక, ఐర్లాండ్ లపై నెగ్గినా నెట్ రన్ రేట్ ను అనుకున్న స్థాయిలో మెరుగు పర్చుకోలేకపోయింది. ఇప్పటికీ ఆసీస్ నెట్ రన్ రేట్ -0.30. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఆసీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గడంతో పాటు నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకోవాలి. నెట్ రన్ రేట్ లో ఇంగ్లండ్ కంటే మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కనీసం 62 పరుగుల కంటే ఎక్కువ తేడాతో అఫ్గానిస్తాన్ పై నెగ్గాల్సి ఉంటుంది.

నెట్ రన్ రేట్ ను కనీసం +1ను దాటించాలి. అటువంటి సమయంలో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే రెండు దార్లు ఉంటాయి. అందులో మొదటిది శనివారం జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ పై శ్రీలంక నెగ్గాలి. అప్పుడు నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ చేరతాయి. ఒకవేళ ఇంగ్లండ్ నెగ్గితే మాత్రం నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ఇది మెరుగు పడాలంటే ఆస్ట్రేలియా అఫ్గాన్ పై భారీ తేడాతో నెగ్గాలి.

తుది జట్లు

ఆస్ట్రేలియా

గ్రీన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, స్మిత్, మ్యాథ్యూ వేడ్ (కెప్టెన్), కమిన్స్, రిచర్డ్ సన్, హేజల్ వుడ్, జంపా

అఫ్గానిస్తాన్

మొహమ్మద్ నబీ (కెప్టెన్), రహ్మనుల్లా, ఉస్మాన్ గనీ, ఇబ్రహీం జద్రాన్, నైబ్, డార్విష్, నజీబుల్లా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్

First published:

Tags: Afghanistan, Australia, Cricket, David Warner, Glenn Maxwell, Steve smith, T20 World Cup 2022

ఉత్తమ కథలు