హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : క్వాలిఫయర్స్ కి ఎండ్ కార్డ్.. సూపర్-12 షురూ.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

T20 World Cup 2022 : క్వాలిఫయర్స్ కి ఎండ్ కార్డ్.. సూపర్-12 షురూ.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

T20 World Cup 2022 : క్వాలిఫయర్స్ కి ఎండ్ కార్డ్.. సూపర్-12 షురూ.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

T20 World Cup 2022 : క్వాలిఫయర్స్ కి ఎండ్ కార్డ్.. సూపర్-12 షురూ.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

T20 World Cup 2022 : ఇక, టీమిండియాకి గ్రూప్ -2 నుంచి సెమీస్ చేరడం అంత కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో మన టీమ్‌తోపాటు సౌతాఫ్రికా, పాకిస్థాన్‌ బలమైనవి కాగా.. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వే జట్లను కాస్త అలవోకగానే ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup 2022) సందడి మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ తొలి అంకం ముగిసింది. అసలు సిసలు మజా అందించిన క్వాలిఫయర్స్ మ్యాచులు ముగిశాయి. 8 జట్లు పోటీపడితే.. అందులో నుంచి నాలుగు టీంలు సూపర్-12 కి అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక (Sri Lanka), నెదర్లాండ్స్ (Netherlands) అర్హత సాధించగా.. గ్రూప్ బీ నుంచి జింబాబ్వే (Zimbabwe), ఐర్లాండ్(Ireland) క్వాలిఫై అయ్యాయి. కచ్చితంగా క్వాలిఫై అవుతాయనుకున్న నమీబియా, వెస్టిండీస్ జట్లు ఇంటిదారి పట్టాయి. ఇక, శనివారం నుంచి అసలు సిసలు సమరం ప్రారంభం కానుంది. సూపర్ -12 పోరు ఫస్ట్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్ 10వ తేదీ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 8లో ఉన్న జట్లు సూపర్ 12 దశకు నేరుగా చేరుకున్నాయి. వీటిలో భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గత టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 12 జట్లలో ఈసారి వెస్టిండీస్‌, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు లేవు. వాటి బదులు నెదర్లాండ్స్‌, జింబాబ్వే కొత్తగా వచ్చి చేరాయి. బంగ్లాదేశ్‌ ఇప్పటికే సూపర్‌-12లో ఉంది. గత టోర్నీలో బంగ్లాదేశ్‌ అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. సూపర్ -12 లో రెండు గ్రూపులు విడిపోయాయి. ప్రతి గ్రూపులో ఆరేసి జట్లు ఉన్నాయి.

ఏ గ్రూప్ లో ఏ జట్టు ఉందంటే..

గ్రూప్-1గ్రూప్-2
1ఆస్ట్రేలియా టీమిండియా
2న్యూజిలాండ్పాకిస్తాన్
3శ్రీలంకబంగ్లాదేశ్
4అఫ్గానిస్తాన్జింబాబ్వే
5ఇంగ్లండ్సౌతాఫ్రికా
6ఐర్లాండ్నెదర్లాండ్స్

ఇక, టీమిండియాకి గ్రూప్ -2 నుంచి సెమీస్ చేరడం అంత కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో మన టీమ్‌తోపాటు సౌతాఫ్రికా, పాకిస్థాన్‌ బలమైనవి కాగా.. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వే జట్లను కాస్త అలవోకగానే ఎదుర్కొనే అవకాశం ఉంది. మన జట్టు సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లలో ఏదో ఒక దాన్ని ఓడిస్తే సరిపోతుంది. అయితే, చిన్న జట్లను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

టీమిండియా పూర్తి షెడ్యూల్ :

మ్యాచ్ నెం డేట్ మ్యాచ్ వెన్యూ టైం
1అక్టోబర్ 23 భారత్ వర్సెస్ పాకిస్థాన్ మెల్బోర్న్ 1.30 PM
2అక్టోబర్ 27భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ సిడ్నీ 12.30 PM
3అక్టోబర్ 30భారత్ వర్సెస్ సౌతాఫ్రికా పెర్త్ 4.30 PM
4నవంబర్ 2భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అడిలైట్ ఓవల్ 1.30 PM
5నవంబర్ 6భారత్ వర్సెస్ జింబాబ్వే మెల్బోర్న్ 1.30 PM
( నోట్ : మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారమే)

భారత బలగం :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్, దీపక్ హుడా, షమీ

స్టాండ్ బై :

శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్

First published:

Tags: Cricket, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు