టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022)లో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. అఫ్గానిస్తాన్ తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది ఐర్లాండ్ జట్టు (AFG vs IRE). మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో, టాస్ మరింత ఆలస్యం కానుంది. గత మ్యాచులో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన ఐర్లాండ్.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక, సూపర్ -12 స్టేజీలో అఫ్గానిస్తాన్ ఇంతవరకు బోణి కొట్టలేదు. దీంతో, ఈ మ్యాచులో విక్టరీ కొట్టాలని భావిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రెండు జట్లు చాలా సార్లు తలపడ్డాయి. ఇప్పటివరకు 23 సార్లు తలపడగా.. 16 సార్లు అఫ్గానిస్తాన్ జట్టే విజయకేతనం ఎగురవేసింది. మరో ఏడు మ్యాచుల్లో ఐర్లాండ్ జట్టు నెగ్గింది. దీంతో, ఈ మ్యాచులో కూడా అఫ్గాన్ జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే, గత మ్యాచులో ఇంగ్లండ్ నే మట్టికరిపించిన ఐర్లాండ్ తగ్గేదే లే అంటుంది. దీంతో, ఈ పోరు సాగడం ఖాయం. అయితే, వరుణుడు కరుణిస్తేనే ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు చూడవచ్చు.
The toss has been delayed at the MCG ahead of the Super 12 clash between Afghanistan and Ireland.#T20WorldCup | #AFGvIRE pic.twitter.com/FCKQDNUbyt
— ICC (@ICC) October 28, 2022
అఫ్గానిస్తాన్ జట్టులో రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జాజయ్, నజిబుల్లా జాద్రాన్ ఇబ్రహీం జద్రాన్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. వీరు క్షణాల్లో ఆట మార్చగలరు. ఇక, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆల్ రౌండర్లు ఆ జట్టు సొంతం. వీరు బ్యాట్ తో పాటు బంతితోనూ కూడా చెలరేగగలరు. ముజీబ్ ఉర్ రహ్మన్, ఫరీద్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ వంటి బౌలర్లను ఐరీష్ జట్టు సమర్ధవంతంగా ఎదుర్కొంటేనే విజయం సొంతమవుతుంది.
మరోవైపు ఐరీష్ జట్టులో పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ బాల్బరైన్, లోర్కాన్ టక్కర్ మంచి టచ్ లో ఉన్నారు. ఈ టోర్నీలో ఈ ముగ్గురే ఐరీష్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశారు. మిగతా బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. బౌలింగ్ లో మాత్రం ఐరీష్ జట్టు స్ట్రాంగ్ గానే ఉంది. జోషువా లిటిల్, ఫియాన్ హ్యాండ్, మార్క్ ఐడైర్, బ్యారీ మెక్గార్తీ రాణిస్తే అఫ్గాన్ జట్టుకు తిప్పలు తప్పవు.
తుది జట్లు అంచనా :
అఫ్గానిస్తాన్ : హజ్రతుల్లా జాజయ్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, నజిబుల్లా జాద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమ్రజా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మన్, ఫరీద్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ
ఐర్లాండ్ : ఆండ్రూ బాల్బరైన్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్రెల్, గెరాత్ డెలానీ, మార్క్ ఐడైర్, బ్యారీ మెక్గార్తీ, ఫియాన్ హ్యాండ్, జోషువా లిటిల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Rashid Khan, T20 World Cup 2022