టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) లో వరుణుడు అంతరాయం కొనసాగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2022 సందడికి వరుణుడు బ్రేకులు వేస్తున్నాడు. కీలక సమయంలో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ తో పాటు అన్ని జట్లకు అడ్డంకిగా మారాడు. మరో మ్యాచు వరుణుడి ఖాతాలోకి చేరింది. మెల్బోర్న్ వేదికగా జరగాల్సిన అఫ్గాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. మెల్బోర్న్‌లో ఎడతెగని వర్షం కారణంగా శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. తొలుత మ్యాచ్ ప్రారంభ సమాయానికి ముందునుంచే వర్షం కురుస్తుంది. టాస్ సమయానికల్లా అంతా సర్దుకుంటుంది అనుకున్నా వాన మాత్రం ఆగలేదు.
దీంతో ఇరు జట్ల కెప్టెన్ లు టాస్ కు కూడా రాలేదు. చివరికి మ్యాచ్ ను ఐదు ఓవర్లకు కుదించైనా నిర్వహిద్దామనుకుంటే అది కూడా సాధ్యపడకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఒక బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఫలితం వల్ల ఇరు జట్లకు నష్టం జరిగినట్టే. ఇప్పటికే అఫ్గాన్ - న్యూజిలాండ్ మ్యాచు కూడా ఈ గ్రౌండ్ లోనే రద్దయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ లో జరిగే మ్యాచులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి.
Group 1 clash between Afghanistan and Ireland has been abandoned due to persistent rain in Melbourne ????#T20WorldCup | #AFGvIRE pic.twitter.com/jhZAbWxuUW
— ICC (@ICC) October 28, 2022
దీంతో, మ్యాచుల్ని మెల్బోర్న్ నుంచి తరలించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి పరిస్థితి. టోర్నీలో సూపర్-12 దశ మొదలై వారం అయినా కాలేదు అప్పుడే వర్షం వల్ల నాలుగు మ్యాచులు ఎఫెక్ట్ అయ్యాయి. ఫలితాలే మారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
టీ20 వరల్డ్ కప్ లాంటివి నిర్వహించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా జరుగుతున్న టోర్నీనే చూస్తుంటే ఐసీసీ వైఫల్యమే అంతటా కన్పిస్తుంది. ఆస్ట్రేలియాలో చాలా గ్రౌండులు ఉన్నాయి. కానీ, ఐసీసీ ఒక్కో గ్రౌండ్ లో ఒక్క రోజే రెండు మ్యాచులు నిర్వహిస్తుంది. ఇప్పుడు మెల్బోర్న్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచు కూడా ఉంది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచు కూడా రద్దయితే ఇరు జట్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోగా.. ఇంగ్లండ్ వరుణడి దయ వల్ల ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు జట్లకు ఈ మ్యాచు కీలకం. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తుంటే మ్యాచ్ జరగడం డౌట్ గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, T20 World Cup 2022, WEATHER