Home /News /sports /

WI Vs SL : ఎవరు ఓడినా ఇంటికే.. కనీస పరువు కోసం రెండు జట్ల పోరాటం.. టాస్ గెలిచిన విండీస్..

WI Vs SL : ఎవరు ఓడినా ఇంటికే.. కనీస పరువు కోసం రెండు జట్ల పోరాటం.. టాస్ గెలిచిన విండీస్..

WI Vs SL

WI Vs SL

WI Vs SL : టీ20 వరల్డ్ కప్ 2021 లో అసలు సిసలు మజా ఇప్పుడు మొదలైంది. ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడుతుండటంతో అభిమానులకు బోలెడంత కిక్ వస్తోంది.

  టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. టాప్ టీమ్స్ తో పాటు చిన్న జట్లు కూడా తగ్గేదే లే అన్నట్లు పోరాడుతున్నాయ్. ఈ నేపథ్యంలో మరో కీలక పోరు కాసేపట్లో ప్రారంభం కానుంది. సూపర్ 12 రౌండ్‌లో గ్రూప్ 2లో వెస్టిండీస్, శ్రీలంక తలపడుతున్నాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విండీస్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. లహిర కుమార బదులు బినుర ఫెర్నాండో ను జట్టులోకి తీసుకుంది.ఈ మ్యాచ్ రెండు జట్లకూ అగ్నిపరీక్ష లాంటి మ్యాచ్ ఇది. ఓడిన జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచిన శ్రీలంక.. మూడు మ్యాచ్‌లల్లో ఒక దాంట్లోనే నెగ్గిన విండీస్ తలపనున్నాయి.

  వెస్టిండీస్‌లో బ్యాటింగ్ లైనప్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. ఆల్‌రౌండర్లతో నిండిపోయింది. ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయిర్, కీరన్ పొల్లార్డ్, జేసన్ హోల్డర్, ఆండ్రీ రస్సెల్.. ఇలా అందరూ బౌలర్ల దుమ్ము దులిపే వారే. గ్రౌండ్‌లో దిగేటప్పటికి వీరి కథ వేరేగా ఉంది. చెత్త షాట్లను ఆడుతున్నారు. షాట్ సెలక్షన్ కూడా రావట్లేదు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గుర్తుండి పోయేలా ఆడట్లేదు కరేబియన్ కింగ్స్. కొత్తగా క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది వారి బ్యాటింగ్ తీరు.

  లంకతో సహా మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ భారీ తేడాతో గెలిస్తే.. తప్ప టోర్నమెంట్‌లో ముందకు వెళ్లలేని పరిస్థితిలో ఉంది విండీస్. రవి రాంపాల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్ ఉన్నా బౌలింగ్ లయ తప్పుతోంది. బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోతున్నారు. ఫలితంగా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోతోందీ టీమ్. అలవోకగా పరుగులను ధారదాత్తం చేస్తోంది.


  శ్రీలంక జట్టు పరిస్థితి బాగుందనుకోవడానికీ ఏ మాత్రం వీల్లేదు. వెస్టిండీస్‌కు భిన్నంగా ఏమీ ఉండట్లేదు. టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కొత్త ముఖాలే అధికం. సీనియర్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా లేరు. అనుభవం ఉన్న వాళ్లు అంతంత మాత్రమే. వారికి సరైన దిశను చూపించే అనుభవజ్ఞుడు లంకేయుల్లో లేరు. బ్యాటింగ్‌లో పాథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక, భానుక రాజపక్ష ఫర్వాలేదనిపించుకున్నారు. బౌలింగ్ మీదే ఆధారపడుతోంది శ్రీలంక టీమ్. వనిందు హసరంగ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడతను. 14 వికెట్లను పడగొట్టాడు.

  తుది జట్లు :

  వెస్టిండీస్ : ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ ఛేజ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, డ్వేన్ బ్రావో, జేసన్ హోల్డర్, కీరన్ పొల్లార్డ్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్, అకీల్ హొస్సెయిన్

  శ్రీలంక : కుశాల్ పెరీరా, పాథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్ష, డాసన్ శనక, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, వనిందు హసరంగ, బినురా ఫెర్నాండో
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chris gayle, Sri Lanka, T20 World Cup 2021, West Indies

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు