షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ (West Indies) థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. డూ ఆర్ డై ఫైట్ లో మూడు పరుగులతో బంగ్లాదేశ్ పై నెగ్గి ఊపిరి పీల్చుకుంది కరేబీయన్ టీమ్. టీ -20 వరల్ కప్ 2021 లో విస్టీండీస్ కిదే ఫస్ట్ విక్టరీ. ఆఖరి బంతి నాలుగు పరుగులు చేయాల్సిన సమయంలో ఆండ్రూ రస్సెల్ సూపర్ డెలివరీతో విండీస్ విజయకేతనం ఎగురవేసింది. బంగ్లా దేశ్ లో లిటన్ దాస్ 43 బంతుల్లో 44 పరుగులు, కెప్టెన్ మహ్మదుల్లా 24 బంతుల్లో 31 పరుగులు రాణించారు. విస్టీండీస్ బౌలర్లందరూ తలా ఓ వికెట్ తీశారు. షకీబ్ 9 పరుగులు, ముష్పీకర్ రహీమ్ 8 పరుగుల తో నిరాశపర్చారు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ టీమ్ దాదాపు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే.
ఇక, అంతకుముందు.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్.. 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ ను నిలువరించారు. ఆఖర్లో పూరన్ చెలరేగడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా సాధించింది. లేకపోతే.. వారి పరిస్థితి మరింత దారుణంగా మారేది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది ఓపెనర్లు క్రిస్ గేల్ (10 బంతుల్లో 4), ఎవిన్ లూయిస్ (9 బంతుల్లో 6) మాత్రమే చేశారు. మూడో ఓవర్ చివరి బంతికి లూయిస్ ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. ఇక ఐదో ఓవర్లో మెహది హసన్.. గేల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోరు 21-2. ఓపెనర్లిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హిట్మెయర్ (9) ఎక్కువసేపు నిలువలేదు. ఆ వెంటనే విండీస్ సారథి కీరన్ పొలార్డ్ (14) రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రసెల్ (0) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ సమయంలో వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన రోస్టన్ చేజ్ ( 46 బంతుల్లో 39) నిలకడైన ఆటతీరుతో ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ.. స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. రసెల్ రనౌట్ అయ్యాక చేజ్ కు జత కలిసిన వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో జేసన్ హోల్డర్ ( 5 బంతుల్లో 15 నాటౌట్) మెరుపులు మెరిపిండచంతో 20 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హోల్డర్ రెండు సిక్సర్లు బాదగా.. మళ్లీ క్రీజులోకి వచ్చిన పొలార్డ్ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు.
బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ ను అడ్డుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన టస్కిన్ అహ్మద్.. 17 పరుగులే ఇచ్చాడు. మెహది హసన్ (4-0-27-2), ఇస్లాం (4-0-20-2) పొదుపుగా బౌలింగ్ చేశారు. షకిబ్.. విండీస్ బ్యాటర్లను కట్టడి చేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.